Advertisement
Google Ads BL

అఖిల్ కి బిగ్ షాక్


బిగ్ బాస్ సీజన్ 4 లో విన్నర్ అవుదామనుకున్న అఖిల్ సార్థక్ కి చెక్ పెడుతూ అభిజిత్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ కప్ ఎగరేసుకుపోయాడు. అఖిల్ బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుంటూ కెరీర్ లో బిజీగా మారాడు. ఢీ డాన్స్ షో కి మెంటర్ గాను, హీరో గాను ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే మోనాల్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్న అఖిల్ కి మళ్ళీ బిగ్ బాస్ ఓటిటి ఆఫర్ వచ్చింది. పర్సనల్ కారణాలంటూ బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టాడు. హౌస్ లో టాస్క్ ల పరంగాను, లుక్స్ పరంగాను యాటిట్యూడ్ తో తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. వరసగా నామినేషన్స్ కి వెళుతున్నాడు సేఫ్ అవుతున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ అంతా మీ ఇష్టం అనే టాస్కును ఇచ్చాడు. దాని ప్రకారం ఓ అంశం మీద బ్యాలెట్ ఓట్స్ వెయ్యమని హౌస్ మేట్స్ కి చెప్పాడు. అందులో బిగ్ బాస్ హౌస్ లో ఫేక్ ఎవరు అన్న విషయంలో చాలామంది అఖిల్ పేరు, నటరాజ్ మాస్టర్ పేరు రాసారు. దానితో వారిద్దరికీ బిగ్ బాస్ ఫేక్ బోర్డ్స్ మేడలో వేసుకోవాలంటూ చెప్పి షాకిచ్చాడు. అయితే హౌస్ మేట్స్ ప్రకారం సరయు, చైతు లు ఫేక్ అని బ్యాలెట్ ఓట్స్ పడినా.. సీక్రెట్ టాస్క్ ఆడిన యాంకర్ శివ అఖిల్ కి, నటరాజ్ కి ఓటింగ్ చెయ్యడంతో అఖిల్, నటరాజ్ లు ఫేక్ పర్సన్స్  గా మిగిలారు. మొన్న లవ్ టాగ్ వేసుకున్న అఖిల్.. ఇప్పుడు ఫేక్ బోర్డ్ వేసుకుని తిరగడం హౌస్ మేట్స్ కే షాకిచ్చింది. 

Akhil Sarthak fake persons in the Bigg Boss house :

Akhil Sarthak and Nataraj Master fake persons in the Bigg Boss house 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs