Advertisement
Google Ads BL

గన్ ఫైరింగ్ రేంజ్ లో గని ట్రైలర్


కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న మూవీ గని. గని ఏప్రిల్ 8 న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గని ప్రమోషన్స్ ని టీం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో మొదలు పెట్టింది. అమ్మకి బాక్సింగ్ ఆడనని మాటిచ్చి, మాటతప్పి ఆ బాక్సింగ్ రింగ్ లో ఎలా గెలిచాడో అనేది గని అంటూ ట్రైలర్ లో చూపించారు. ఇక లైఫ్ లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చెయ్యమని నదియా కొడుకు గని ని అడిగే డైలాగ్ తో మొదలవుతుంది ట్రైలర్. గెలిస్తేనే ప్రపంచం తన మాట వింటుంది అని నమ్మే గని, తల్లికి ఇచ్చిన మాట తప్పి బాక్సింగ్ లో ఎలా ఆడాడు, ఆ బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్దులని తట్టుకుని ఎలా గెలిచాడో అనేది రివీల్ చేసారు. నవీన్ చంద్ర వరుణ్ కి అపోజిట్ బాక్సర్ గా గెలవాలనే తపన ఉన్న ప్లేయర్ గా కనిపించారు.

Advertisement
CJ Advs

అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, కన్నడ ఉపేంద్ర, జగపతి బాబు లాంటి స్టార్స్ కి ఈ గని కథకి సంబంధం ఏమిటి? గని తల్లికి ఎందుకు బాక్సింగ్ అంటే అంత కోపం? ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే.. అది నేషనల్ ఛాంపియన్ అయిన రోజే అవ్వాలి అదే నా గోల్ అని వరుణ్ చెప్పే డైలాగ్, ఎందుకు బాధపడుతున్నావ్.. ఆటలో ఓడిపోయినందుకా.. లేదంటే తల్లికి ఇచ్చిన మాట తప్పాను అనా అని నదియా చెప్పే బలమైన డైలాగ్స్, వరుణ్ తేజ్ బాక్సర్ గా చూపించిన మేకోవర్, హీరోయిన్ సాయి మంజ్రేకర్ తో వరుణ్ రొమాన్స్ అన్ని.. గని మూవీ లో హైలెట్ లా అనిపిస్తున్నాయి.

గని మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Varun Tej Ghani Movie Trailer released :

Varun Tej Ghani Movie Trailer Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs