రాధే శ్యామ్ తో అభిమాన ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయిన ప్రభాస్ తమిళ హీరో సూర్యకి మాత్రం చాలా పెద్ద హెల్ప్ చేసాడు. ఎలాగంటే...
మార్చి 10 న విడుదలైన సూర్య చిత్రం ET (ఎవరికీ తల వంచడు) చప్పగా ఉందనే టాక్ తో చతికిలపడింది. అయితే మార్చి 11 న వచ్చిన రాధే శ్యామ్ మరీ నిరాశపరచడంతో ఎలాగోలా సర్దుకుందాం.. సరిపెట్టుకుందాం అనుకుంటూ ET థియేటర్స్ వైపు కదిలిన జనం ఆ ఫ్లాప్ ఫిలింకి ఆశించిన దానికంటే ఎక్కువ రెవిన్యూ వచ్చేలా చేయడం విశేషం.
4 కోట్లకు బ్రేక్ ఈవెన్ అనే టార్గెట్ తో బరిలోకి దిగిన ET మూవీకి ఫస్ట్ డే వచ్చిన రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ చూస్తే 50 పర్శంట్ రికవరీ కూడా పాజిబుల్ కాదేమో అనుకున్నారు అందరూ. అయితే అనూహ్యంగా ఆ చిత్రానికి ఫస్ట్ వీక్ లోనే 2 కోట్ల 80 లక్షలు సమర్పించి తెలుగువారికి అడాప్టెడ్ సన్ అని చెప్పుకునే సూర్య పట్ల ప్రేమను చాటుకున్నారు మన ప్రేక్షకులు. ఈ వీక్ కూడా పెద్ద సినిమాలేవీ లేవు కనుక ఆర్ ఆర్ ఆర్ రంగంలోకి దిగేలోపు మరో కోటీ ఇరవై లక్షలు రాబడితే నిజంగా సూర్య తలవంచని ఫలితం అందుకున్నట్టే..!
ET (ఎవరికీ తల వంచడు) ఫస్ట్ వీక్ AP-TG కలెక్షన్స్
నైజాం : 88 లక్షలు
సీడెడ్ : 47 లక్షలు
ఉత్తరాంధ్ర : 43 లక్షలు
ఈస్ట్ : 26 లక్షలు
వెస్ట్ : 18 లక్షలు
గుంటూరు : 23 లక్షలు
కృష్ణా : 21 లక్షలు
నెల్లూరు : 14 లక్షలు
AP - TG టోటల్ ఫస్ట్ వీక్ షేర్ : 2.80 Cr