Advertisement
Google Ads BL

పెన్నీ సాంగ్ తో దున్నేస్తాడట మహేష్


సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సెకండ్ సింగల్ అప్ డేట్ వచ్చేసింది. మార్చ్ 20 న మహేష్ ఫ్యాన్సుకి పెన్నీ సాంగ్ రూపంలో పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు థమన్. సర్కారు వారి సినిమాలో మహేష్ మాస్ క్యారెక్టరైజేషన్ తెలిపేలా - సినిమా థీమ్ కి మ్యాచ్ అయ్యేలా థమన్ కంపోజ్ చేసిన పెన్నీ సాంగ్ సూపర్బ్ బీట్ తో సెట్ అయిందని ఇన్ సైడ్ టాక్.

Advertisement
CJ Advs

ఇక ఇప్పటికే విడుదలైన సర్కారు వారి ఫస్ట్ సింగిల్ కళావతి ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకున్న విషయం తెలిసిందే. వాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఫిబ్రవరి 13 న వచ్చిన కళావతి మ్యూజిక్ వీడియో 30 రోజులకే 90 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి 100 మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. మహేష్ బాబు - కీర్తి సురేష్ ల ఫాబ్యులస్ పెయిర్ ని విజువల్ ఫీస్ట్ లా చూపించిన కళావతి మ్యూజిక్ వీడియోలో మహేష్ మ్యాజికల్ సిగ్నేచర్ స్టెప్ బాగా హైలైట్ అయింది. విపరీతంగా వైరల్ అయింది. మరీసారి పెన్నీ సాంగ్ లో మహేష్ ఎలా దున్నేస్తాడో.. ఏ రేంజ్ ట్రీట్ ఇస్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు తన ఫ్యాన్స్.!

అన్నట్టు గత కొన్ని సినిమాలుగా సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ తోనే సరిపెడుతూ వచ్చిన మహేష్ మళ్ళీ పోకిరి రేంజ్ లో దూకుడు చూపించిన సినిమాగా సర్కారు వారి పాట చిత్రం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. గీత గోవిందంతో సెన్సషనల్ హిట్ కొట్టిన దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాటను కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మలిచారనీ.. మే 12 న బ్లాక్ బస్టర్ రిజల్ట్ తో సర్కారు వారి పాట మారుమోగడం తధ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.! 

Penny Song From SVP :

Sarkaru Vaari Paata Second Single On March 20th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs