Advertisement
Google Ads BL

కెజిఎఫ్2 బెంగుళూర్ లో.. మరి విజయ్ బీస్ట్


ఏప్రిల్ 14 న మూడు భాషల నుండి మూడు భారీ చిత్రాలు బాక్సాఫీసు ఫైట్ కి దిగబోతున్నాయి. అది తమిళ్ నుండి విజయ్ బీస్ట్. కన్నడ నుండి కెజిఎఫ్, హిందీ నుండి జెర్సీ. ముగ్గురు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు బాక్సాఫీసు ఫైట్ కి దిగడంతో ఏప్రిల్ 14 డేట్ క్రేజీగా మారింది. తమిళ్ లో విజయ్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెల్సన్ దర్శకత్వంలో అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో గ్లామర్ భామ పూజ హెగ్డే తో జోడి కట్టిన విజయ్ బీస్ట్ తో ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నారు. విజయ్ ఫాన్స్ సోషల్ మీడియా లో బీస్ట్ అప్ డేట్స్ కోసం యుద్ధం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ ఎలాంటి అంచనాలు లేకుండానే కెజిఎఫ్ తో భారీ హిట్ కొట్టడంతో.. పార్ట్ 2 పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. 

Advertisement
CJ Advs

కెజిఎఫ్ నుండి మార్చ్ 27 న ట్రైలర్  లాంచ్ చెయ్యబోతున్నట్టుగా ఎప్పుడో అప్ డేట్ ఇచ్చింది టీం. కెజిఎఫ్ 2 ట్రైలర్ ని బెంగుళూర్ వేదికగా నిర్వహించబోతున్నారు. అక్కడికి తెలుగు, తమిళ్ నుండి పలువురు మీడియా వాళ్ళని బెంగుళూర్ కి తీసుకువెళుతున్నారు. ఈ ఈవెంట్ భారీగా నిర్వహించబోతున్నారు. ఇక జెర్సీ తో షాహిద్ కపూర్ కూడా డిసెంబర్ లోనే చాలావరకు ప్రమోషన్స్ పూర్తి చేసారు. కెజిఎఫ్ ఈవెంట్ బెంగుళూర్ లో నిర్వహిస్తున్నారు. దానికి డేట్ కూడా ఫిక్స్ అవడంతో.. ఇప్పుడు విజయ్ ఫాన్స్ లో కంగారు పెరిగింది. అందుకే బీస్ట్ అప్ డేట్, బీస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు ఫాన్స్. 

Kgf Chapter 2 trailer will be released in Bangalore stadium:

Vijay Fans Trends on Twitter hashtag BeastPreReleaseEvent
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs