Advertisement
Google Ads BL

RRR ఫస్ట్ షో తర్వాత ఉంటుందీ..


ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కి కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ లో ఇంట్రెస్టింగ్ గా ప్రమోషన్స్ చేసినా.. మళ్ళి ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి అండ్ స్టార్ హీరోల ఎక్కడా తగ్గడం లేదు. అలియా భట్ లేకపోయినా.. రాకపోయినా.. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తో పాటుగా రాజమౌళి ప్రమోషన్స్ ని భుజాల మీద మోస్తున్నారు. రీసెంట్ గా కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి రాజమౌళి, ఆర్.ఆర్.ఆర్ హీరోలని ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ మొత్తం ఫన్నీ గా నడిచింది. ఆర్.ఆర్.ఆర్ షర్ట్  వేసుకున్న అనిల్ రావిపూడి..  ముగ్గురు ఆర్.ఆర్.ఆర్ లని నేను అడిగిన ఒక్కో ఆర్ కి ఆన్సర్ ఇవ్వమని  అడిగారు. దానితో రాజమౌళి కి ఓ ఆర్ ఇచ్చి ఆర్.ఆర్.ఆర్ లో ఇప్పటివరకు బయటపెట్టని ఓ సీక్రెట్ చెప్పమని అడగగా.. దానికి రాజమౌళి సీక్రెట్ ఏం లేదు.. ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ హాఫ్ అనిల్ కి చూపించాను అనగానే ఎన్టీఆర్ ఆ కాలే కర్ర తీసుకుని అంటూ ఫన్ చేసాడు. అనిల్ అయితే భయపడినట్లుగా ఎక్సప్రెషన్స్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

రాజమౌళి నేను చెప్పను.. నాకు స్కిట్ ఇవ్వండి అని అడిగారు. దానికి నాటు నాటు సాంగ్ కి డాన్స్ చెయ్యమంటే.. ఆయన కూర్చున్న కాళ్లతో వన్, టు, త్రీ లు చెప్పారు. దానితో ఎన్టీఆర్ అందుకుని రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎలా ఉంటుందో మాకు తెలుసు, ఆ సినిమా ఫస్ట్ షో అవ్వగానే టాక్ కి, ఆడియన్స్ చేసే రచ్చ కి నాటు నాటు స్టెప్స్ వేస్తారు అనగానే రాజమౌళి కూడా డన్ అన్నారు. సరే ఈ క్రెడిట్ నాకివ్వండి అని అనిల్ అడగ్గానే మీరు వెళ్లి ఆయన పక్కన ఆడండి అన్నారు ఎన్టీఆర్. ఇక రాజమౌళి తో వర్క్ ఎలా ఉంటుంది అని అడగగా.. అమ్మో జక్కన్నా ఇది కష్టంగా ఉంది అనగానే.. ఓ స్మైల్ ఇస్తారు. జక్కన్నా ఈరోజు త్వరగా వదిలిపెట్టండి అంటే.. స్మైల్ ఇస్తారు అప్పుడు వస్తుంది చూడండి అంటూ ఎన్టీఆర్ నవ్వించారు. 

తర్వాత రామ్ చరణ్ ని ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్స్ ఎన్ని ఇచ్చారో చెప్పమంటే దానికి కూడా ఎన్టీఆర్ ఆన్సర్ ఇచ్చాడు. లాస్ట్ లో రెమ్యునరేషన్స్ చ్చేప్పమని అడిగినా అనిల్ ని కన్ఫ్యూజ్ చేసారు తప్ప వాటి వివరాలని మాత్రం బయట పెట్టలేదు.

RRR Team Exclusive Interview With Director Anil Ravipud:

Anil Ravipudi hilarious interview with RRR Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs