Advertisement
Google Ads BL

స్టాండ్ అప్ హీరోని సక్సెస్ వరిస్తుందా.?


యంగ్ హీరోల్లో గత కొన్నేళ్లుగా సక్సెస్ కి దూరమైన రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్ తో వచ్చే శుక్రవారమే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. వరస ప్లాప్స్ తో రాజ్ తరుణ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. తన మార్క్ మ్యానరిజం, కామెడీ స్టయిల్ రాజ్ తరుణ్ ని దెబ్బేసింది. ఒకే రకమయిన కేరెక్టర్స్ తో.. బలమైన కథలు లేక, అనుభవం లేని దర్శకులతో రాజ్ తరుణ్ కి వరస ప్లాప్స్ ఎదురవుతున్నాయి. ప్రెజెంట్ స్టాండ్ అప్ రాహుల్ ప్రమోషన్స్ చేస్తున్నా సినిమా పై బజ్ రావడమే లేదు. ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, వరుణ్ తేజ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ఏది చేసినా ప్రేక్షకుల్లో స్టాండ్ అప్ రాహుల్ ఫై ఇంట్రెస్ట్ తెప్పించలేకపోతున్నారు.

Advertisement
CJ Advs

వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టికెట్స్ బుక్ మై షో లో ఓపెన్ అయినా.. అడ్వాన్స్ బుకింగ్ లేక బుక్ మై షో నీరసంగా కనిపిస్తుంది. అసలే రాధే శ్యామ్ ప్లాప్ మూడ్ లో ఉన్న ఆడియన్స్ సక్సెస్ లేని హీరో సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనిపిస్తుంది. మరి రాజ్ తరుణ్ కి ఇది చాలా క్రూషియల్ టైం. ఖచ్చితంగా స్టాండ్ అప్ రాహుల్ తో సక్సెస్ సాదించాలి.. లేదంటే రాజ్ తరుణ్ కెరీర్ కి ఇబ్బందే.. మరి ఈ యంగ్ హీరో స్టాండ్ అప్ రాహుల్ తో అందరిని నవ్వించి తానూ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. 

Raj Tharun upcoming entertainer Stand Up Rahul:

Raj Tarun Stand Up Rahul update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs