Advertisement
Google Ads BL

బరిలోకి దిగిన గాడ్ ఫాదర్ బాడీగార్డ్


మెగాస్టార్ చిరు - సల్మాన్ ఖాన్ సింగిల్ స్క్రీన్ మీద కనిపిస్తే.. అటు బాలీవుడ్ ఆడియన్స్, ఇటు సౌత్ ఆడియన్స్ బిగ్ సర్ ప్రైజ్ గా ఫీలవడం ఖాయం. ఇప్పుడు వారిద్దరూ కలిసి గాడ్ ఫాదర్ మూవీ లో గురు శిష్యులుగా కనిపించబోతున్నారు. సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ కి శిష్యుడిగా, బాడీ గార్డ్ లా కనిపించడం అనే మాటకే మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. మరి ఈ రోజు అఫీషియల్ గా సల్లు భాయ్ గాడ్ ఫాదర్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ముంబైలోని కర్జాత్ స్టూడియో లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతున్న గాడ్ ఫాదర్ షూట్ లోకి సల్మాన్ ఖాన్ అడుగుపెట్టగానే చిరు బొకే తో స్వాగతం పలికారు. ఇద్దరు లెజెండ్స్ ని ఒకే పిక్ లో చూడడమే కన్నుల పండుగలా ఉంటే.. ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇంకెంత మజా ఉంటుంది.

Advertisement
CJ Advs

ముంబై లో జరగబోయే 15 రోజుల భారీ షెడ్యూల్ లో చిరు - సల్మాన్ ఖాన్ కాంబో సీన్స్ ని దర్శకుడు మోహన్ రాజా షూట్ చేస్తారని, ఈ 15 రోజుల్లో సల్మాన్ ఖాన్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అవుతుంది అని తెలుస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ షూటింగ్ లో జాయిన్ అవడం పట్ల చిరు ట్వీట్ చేస్తూ.. గాడ్ ఫాదర్ - భాయ్, సల్మాన్ ఖాన్ కి స్వాగతం, మీ ఎంట్రీ అందరిలో ఉత్సాహాన్ని పెంచింది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.. మీరు నటించడంతో ఈ సినిమా లెవల్ పెరిగిందన్నారు. మీరు ఈ సినిమాలో నటించడం పట్ల ఆడియన్స్ కి నిజంగా థ్రిల్, కిక్ ఎక్కడం ఖాయం అంటూ మెగాస్టార్ ట్వీట్ చేసారు. 

Bollywood Superstar Salman Khan Joins The Shoot of GodFather:

Bollywood Superstar Salman Khan Joins The Shoot Of Megastar Chiranjeevi - Mohan Raja - Konidela Productions And Super Good Films – Godfather
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs