Advertisement
Google Ads BL

204 మిలియన్ వ్యూస్ తో ఊఁ అన్నారు


ఊఁ అంటావా మావా.. ఉ ఊఁ అంటావా మావా అంటూ అల్లు అర్జున్ - సమంతలు చలాకీగా చిందేసిన పుష్ప సాంగ్ కి ఏకంగా 204 మిలియన్ల వ్యూస్ తో ఊఁ అనేసారు వ్యూవర్స్. దేవి రాకింగ్ ట్యూన్ తో లిరికల్ వీడియో నుంచే మాంచి ఊపుతో సాగిన ఈ పాట జోరు - విజువల్ గా వీడియో సాంగ్ రూపంలో విడుదలయ్యాక మరింత రంజుగా పుంజుకుంది. 

Advertisement
CJ Advs

బన్నీ నాటు బాడీ లాంగ్వేజ్ కి సమంత హాటు అప్పీల్ తోడవడంతో ఆన్ స్క్రీన్ సెగలు రేపిన ఈ సాంగ్ యు ట్యూబ్ లోనూ అది కంటిన్యూ చేస్తూ రికార్డ్ వ్యూస్ రాబట్టుకుంటూ ఉండడంపై పుష్ప యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇక పుష్పరాజ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటన ఎంతగా ఆకట్టుకుందో.. ఎంతమందిని ఇన్ స్పయిర్ చేసి ఎన్ని ఇమిటేషన్ వీడియోస్ ని నేటికీ సోషల్ మీడియాలో చూపిస్తూ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తగ్గేదే లే.. అనే బన్నీ మేనరిజం విలేజెస్ లోని కిడ్స్ నుంచి విరాట్ కోహ్లీ వరకూ అందరూ ప్రదర్శించడం ప్రత్యేక అంశం. ప్రశంసార్హం.!

ఇప్పుడిక ఆకాశాన్ని తాకుతోన్న అంచనాల నడుమ పుష్ప పార్ట్ 2 కోసం రంగం సిద్ధం చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. అందులోనూ అంచనాలకు తగ్గట్టు కాదు... అంతకుమించి ఉండేలా పుష్ప రూలింగుని సుక్కు ప్లాన్ చేస్తున్నారనేది స్పష్టమైన సమాచారం. ఆ డీటెయిల్స్ మీ సినీజోష్ లో - మరో అప్ డేట్ లో...!

ఇది చదివిన ఊపులో మీకూ ఓసారి ఊఁ అనాలనిపిస్తే... CLICK HERE

204 Million Views For Oo Antava Mawa Song:

204 Million Views For Pushpa Oo Antava Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs