Advertisement
Google Ads BL

ఐటెం సాంగ్ కే 2 cr కావాలట


స్టార్ హీరోలకి మోస్ట్ లక్కీయస్ట్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న పుష్ప మూవీ తో తన రేంజ్ పెంచుకుంది. ఆ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో హిట్ అవడంతో.. ఆ సినిమాలో నటించిన రష్మిక క్రేజ్, ఇమేజ్ అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే బాలీవుడ్ బడా ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్మిక.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది. వర్కౌట్స్ తో పర్ఫెక్ట్ జిమ్ బాడీ ని మెయింటింగ్ చేస్తూ ఆమె.. ఏ సినిమా ప్రమోషన్స్ లో కనిపించినా.. యూత్ గుండెజారేలా గ్లామర్ షో చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే పాప రేంజ్ బాగా పెరగడంతో.. అమ్మడిని ఓ ఐటెం సాంగ్ కోసం సంప్రదిస్తే.. ఏకంగా రెండు కోట్లు అడిగిందట. పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ చెయ్యడం, ఆ సాంగ్ నేషనల్ లెవల్లో హిట్ అయ్యి సమంత కి విపరీతంగా పేరు రావడమే కాదు.. ఆ సాంగ్ కోసం ఆమె భారీగా అందుకుంది అనే టాక్ ఉంది. అందుకే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న తాను ఐటెం సాంగ్ చెయ్యాలంటే రెండు కోట్లు కావల్సిందే అంటుందట. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేస్తున్నారు. ఆ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం నేషనల్ క్రష్ రశ్మికని సంప్రదించగా.. రెండు కోట్లు డిమాండ్ చెయ్యడంతో నిర్మాతలు షాకయ్యారట. 

Rashmika demands 2 cr for Item song:

Rashmika in talks for a special song in Animal?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs