ప్రభాస్ రాధే శ్యామ్ టాక్ తో సినిమా చూసిన ప్రభాస్ అభిమాని రవి తేజ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. గుంటూరు జిల్లా కారంపూడి పల్నాడు ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర ప్రభాస్, రాధే శ్యామ్ కటౌట్స్ కడుతూ హంగామా చేస్తున్న టైం లో బస్సు ఢీ కొని ప్రభాస్ ఫ్యాన్ ఒకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించిన ఘటన అందరిని కలిచి వేసింది. ఆ విషయం తెలిసిన ప్రభాస్ చాలా ఫీలైనట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ ఆ అభిమాని ఫ్యామిలీకి వెంటనే రెండు లక్షల సహాయం చేశారట. అంతేకాకుండా ప్రభాస్ తన అభిమాన ఫ్యామిలీకి అండగా ఉంటాయని, ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటానని చెప్పారట.
రాధే శ్యామ్ భారీ అంచనాలు నడుమ మార్చ్ 11 న విడుదలై.. ఆ అంచనాలు అందుకోలేక కిందా మీద పడుతుంది. దానితో ప్రభాస్ ఫాన్స్ కూడా రాధే శ్యామ్ రిజల్ట్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు.