Advertisement
Google Ads BL

ఆనంద్ దేవరకొండ బర్త్ డే స్పెషల్


విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. ఆనంద్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఆనంద్ నటిస్తున్న చిత్రాల నుండి ఆయన లుక్స్ రిలీజ్ చేస్తూ ఆనంద్ దేవరకొండ కి బర్త్ డే విషెస్ చెప్పారు ఆయా చిత్రాల యూనిట్స్ మెంబెర్స్. అన్న విజయ్, తల్లి తండ్రులతో కలిసి ఆనంద్ కేక్ కట్ చేసి తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అప్ డేట్స్ ఆయన బర్త్ డే స్పెషల్ గా మీ కోసం..

Advertisement
CJ Advs

హైవే లుక్

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా హైవే. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో  మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆనంద్ దేవరకొండ సందర్భంగా హైవేచిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. హిల్ స్టేషన్ లో ఈ యువహీరో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందీ పోస్టర్. కొండ రాయిపై కూర్చుని చుట్టూ అందమైన నేచర్ ను చూస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా ఆనంద్ కు బర్త్ డే విశెస్ చెప్పింది చిత్ర యూనిట్ కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు హైవే మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

బేబీ లుక్

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా బేబీ.  ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్,  వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ఎలా ఉందో చూస్తే...వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న బేబీ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.

గం..గం..గణేశా లుక్

సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నారు. ఆనంద్ నుండి  గం.. గం.. గణేశా  ఓ డిఫరెంట్ ఫిల్మ్ కాబోతోంది.

ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా గం..గం..గణేశా చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆనంద్ టైటిల్ పేరు గణేష్ అని పోస్టర్ ద్వాారా తెలుస్తోంది. మన గణేష్ గాడి స్వాగే సెపరేటు అంటూ రిలీజ్ చేసిన ఫొటో స్కెచ్ లో పగిలిన కళ్లద్దాలు, తలకు బ్యాండేజ్ చూస్తుంటే గణేష్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు అర్థమవుతోంది.అంతే కాకుండా నోట్లో సిగరెట్ ద్వారా క్యారెక్టర్ కు ఉన్న స్వాగ్ ను సిగరెట్ చివర్లో లవ్ సింబల్ చూస్తుంటే హీరో లవ్ ను తెలియజేస్తుంది.ఓవరాల్ గా ఈ పోస్టర్ సినిమాలో హీరో ఆనంద్ క్యారెక్టర్ ను తెలియజేస్తుంది.

Anand Deverakonda Birthday Special:

Anand Deverakonda Birthday Special updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs