Advertisement
Google Ads BL

బ్రహ్మాస్త్ర లో అలియా పవర్ ఫుల్ లుక్


మరో పది రోజుల్లో సీతమ్మగా ఆర్.ఆర్.ఆర్ మూవీ తో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతున్న అలియా భట్.. ఈమధ్యనే గంగూభాయ్ కతీయవాడి సినిమాలో విమర్శకుల నుండి ప్రశంశలు అందుకున్న పెరఫార్మెన్స్ తో అందరి మన్నన పొందింది. నెగెటివ్ టాక్ తోనే అలియా భట్ గంగూభాయ్ తో 100 కోట్ల క్లబ్బులోకి చేరింది. ఇప్పుడు సీత గా రాబోతుంది. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ కి జోడిగా సీత లుక్ లో అలియా అద్భుతమైన అందంతో అదిరిపోతోంది అనేది ఆమె లుక్ చూస్తే తెలుస్తుంది. పెరఫార్మెన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జక్కన్న అక్కడ. ఆమెని ఎలా ప్రెజెంట్ చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు. రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ సాంగ్ లోనే రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి పోటీ ఇస్తూ అందం అభినయంతో సూపర్బ్ అనిపించింది.

Advertisement
CJ Advs

ఇక ఈ రోజు అలియా భట్ బర్త్ డే.. ఆందుకే ఆమె నటిస్తున్న బాలీవుడ్ బ్రహ్మాస్త్ర నుండి.. అలియా భట్ పవర్ ఫుల్ లుక్ ని రివీల్ చేస్తూ టీం ఆమెకి స్పెషల్ బర్త్ డే విషెస్ అందించింది. ఆర్.ఆర్.ఆర్ లో సీత గా ట్రెడిషనల్ గా ఉన్న అలియా భట్, గంగూభాయ్ లో బోల్డ్ కేరెక్టర్ లో కనిపించింది. ఇప్పుడు బ్రహ్మాస్త్రలో అలియా భట్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ లుక్ లో మండే అగ్నిగోళం మధ్యన అలియా భట్ ఫస్ట్ లుక్ బ్రహ్మాస్త్ర పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా ఈ సినిమాలో రణబీర్ కపూర్, బిగ్ బి, గెస్ట్ రోల్ లో కింగ్ నాగ్ నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర రెండు పార్ట్ లుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Alia Bhatt birthday special:

Alia Bhatt looks powerful and intense in this new poster from Brahmastra.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs