Advertisement
Google Ads BL

పవన్ కౌంటర్ - వైసిపి ఎన్ కౌంటర్


అందరూ జనసేన ఆవిర్భావసభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఆత్రంగా ఎదురు చూసారు. పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం పై ఎలాంటి సెటైర్స్ వేస్తారు, బిజెపి తో పొతుపై ఏం మాట్లాడతారు. టిడిపిని పవన్ కలుపుకుపోతారా.. అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అందరూ అనుకున్నట్టుగానే జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సభావేదిక మీదుగా అధికార వైసీపీ తీరుపై నిప్పులు కురిపించారు పవన్. వైసిపి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది అని, అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతామన్నారు. 

Advertisement
CJ Advs

మీరు సహకరిస్తే రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్. జనసేన కార్యకర్తలపై వైకాపా చేసే దాడులకు వెన్ను చూపేది లేదన్న పవన్.. వైకాపా మహిషానికి మొలిచిన కొమ్ములు విరగ్గొట్టి గద్దె దించుతామని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించే ఏర్పాట్లలో భాగంగా భాజపా నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తానన్నారని, దానికోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు పవన్‌. వైసిపి వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని పవన్ ఛాలెంజ్ చేసారు. అంతేకాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పొత్తుల గురించి తర్వాత ఆలోచిస్తామన్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకునే విషయంలో చెప్పకనే చెప్పినట్లుగా మాట్లాడారు. 

పవన్ కళ్యాణ్ స్పీచ్ అలా పూర్తయ్యిందో లేదో.. ఇలా వైసిపి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ ని చీల్చి చెండాడే పనిలో బిజీగా మారారు. పవన్ ఒక రబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ పార్టీ ఎవరికోసం పెట్టాడో క్లారిటీ ఇచ్చాడు.పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి పనిచేస్తా అని చెప్పాడు.. పవన్ కళ్యాణ్ కమెడియన్ లాంటి వాడు... నాగబాబు, పవన్ కళ్యాణ్ కు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అంటూ మంత్రి వెలంపల్లి అన్నారు.

మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కంఠం చంద్రబాబు ది స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్ పొత్తులపై ఓపెన్ గా చెప్పొచ్చు కదా. బిజెపి ని చొక్కా పట్టుకుని నిలదియ్యలేదు. భీమ్లా నాయక్ సినిమా డైలాగ్స్ పవన్ చెప్పాడు. పవన్ రాజకీయ ఊసరవెల్లి, కంఠం నీది, భావం చంద్రబాబుది, చంద్రబాబు ని మళ్ళీ అధికారంలోకి తేవడమే పవన్ లక్ష్యం. పవన్ కళ్యాణ్ సింగిల్ కాదు.. మింగిల్. పవన్ ఏపీకి గెస్ట్.. టూరిస్ట్. మూడు పార్టీలు కలిసి పని చేస్తాయని పవన్ చెప్పారు. పవన్ తీరుతో జనసైనికులు అయోమయంలో ఉన్నారు. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడ, అందరికి నమస్కారం పెట్టిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం మీ సంస్కారం ఎక్కడా.. అంటూ పవన్ ని వైసిపి మంత్రులు ఎన్ కౌంటర్ చేసా

Pawan Counter - YCP Encounter:

Pawan Kalyan speech at Janasena 9th formation day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs