Advertisement
Google Ads BL

రాధే శ్యామ్ ఎఫెక్ట్: ఒక్కరు కాదు ఇద్దరు బలి


ప్రభాస్ రాధే శ్యామ్ ప్లాప్ టాక్ ఇద్దరి ప్రాణాలని బలి తీసుకుంది. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఫస్ట్ షో కె మిక్స్డ్ టాక్ రావడం ఈవెనింగ్ కి ప్లాప్ టాక్ పడిపోవడంతో.. ఆ ప్రభావం కలెక్షన్స్ మీద కూడా చూపించింది. కానీ రాధే శ్యామ్ ప్లాప్ అవడంతో ప్రభాస్ అభిమాని ఒకరు కర్నూల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరిని కంట తడి పెట్టించింది. సినిమా ప్లాప్ అయితే.. నెక్స్ట్ సినిమా హిట్ అవ్వాలనే కసితో ఉండాలి కానీ.. ఇలాంటి దారుణాలకు పాల్పడడం  ఏమిటి అంటూ అందరూ నెత్తి నోరు కొట్టుకున్నారు. ఫాన్స్ కి హీరోలంటే పిచ్చి ఉండొచ్చు కానీ.. ప్రాణాలు తీసుకునేంత అభిమానం ఉండకూడదు. ఏముంది హీరోలకి ఓ సినిమా హిట్ అయితే మరో సినిమా ప్లాప్ అవుతుంది. ఆ తర్వాత హిట్ పడుతుంది. అది కామన్. కానీ సినిమాలు పోయాయని ప్రాణాల మీదకి తెచ్చుకోవడం మాత్రం నిజంగా జాలి పడాల్సిన విషయం.

Advertisement
CJ Advs

రాధే శ్యామ్ ప్లాప్ ఎఫెక్ట్ తో రవి తేజ అనే వీరాభిమాని ఆత్మహత్య చేసుకోగా.. రాధే శ్యామ్ సినిమా రిలీజ్ హంగామాలో రైల్వే కొడూరు థియేటర్ ముందు ప్రభాస్ ఫ్యాన్స్ ఒళ్ళు తెలియకుండా సంబరాలు చేసుకుంటుఉండగా అపశ్రుతి నెలకొంది. ఆ థియేటర్ దగ్గర బస్సు స్కూటర్ ను ఢీ కొట్టడంతో ప్రభాస్ అభిమాని తీవ్ర స్థాయిలో గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రభాస్ అభిమాని మృతి చెందాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఇదంతా ఓ హీరో కోసమే జరిగింది. తమ హీరో సినిమా ప్లాప్ అయ్యింది అని బలవన్మరణానికి పాల్పడిన రవితేజ తల్లి ఏమైపోతుంది. అసలే తండ్రి లేడు.. తల్లిని ఒంటరిదాన్ని చేసి రవి తేజ చనిపోయాడు. ఇప్పుడు ఆమెకి దిక్కెవరు.. ఈ విషయంలో స్టార్ హీరోల ఫాన్స్ ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. హిట్ అయితే సంబరాలు చేసుకోండి ఎవరూ కాదనరు.. ప్లాప్ అయినా దాన్ని తీసుకోండి.. నెక్స్ట్ హిట్ కోసం వెయిట్ చెయ్యండి.. అంతేగాని ప్రాణాలు తీసుకునే పనులు పెట్టుకోకండి..

Prabhas Fan Commits Suicide due to Radhe Shyam:

Prabhas fan commits suicide after watching Radhe shyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs