కరోనా కల్లోలం సద్దుమణిగింది. భీమ్లా నాయక్ సందడి ముగిసింది. ఆంధ్ర టికెట్ రేట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. రాధే శ్యామ్ రాక కూడా పూర్తయింది. ఇప్పుడిక అందరి దృష్టీ ఆర్ ఆర్ ఆర్ సృష్టించనున్న సంచలనాల పైనే.!
తారక్ - చరణ్ లతో దర్శక బాహుబలి రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై ఎంతటి హైప్ ఉందో.. ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అకుంఠిత దీక్షతో అద్భుత చిత్రాలను మనకందిస్తూ అప్రతిహత విజయాలతో పయనిస్తోన్న రాజమౌళి పట్ల అచంచల నమ్మకమే కాదు.. గౌరవమూ ఉంది ప్రేక్షకులకి. దర్శకుడిగా ఎంతటి హిట్లిచ్చినా - ఎన్నో మెట్లెక్కినా నేటికీ తన సినిమాలోని ప్రతి ఒక్క షాట్ నీ, ఫ్రేమ్ నీ కూడా ఓపికగా చెక్కే జక్కన్న ఆర్ ఆర్ ఆర్ లో ఏదో అత్యద్భుతాన్ని ఆవిష్కరించనున్నారనే సంకేతం స్పష్టంగా అందుతోంది.
దానికి తోడు యంగ్ టైగర్ తారక్ ని బిగ్ స్క్రీన్ పై చూసి మూడున్నరేళ్లు కావొస్తూండడంతో ఆవురావురుమంటూ ఉన్నారు అభిమానులు. అలాగే చరణ్ సినిమా వచ్చీ మూడేళ్లు అవుతుండడంతో అటు మెగా ఫాన్స్ కూడా ఆరాటంగానే ఉన్నారు. ఇపుడీ ఇద్దరు క్రేజీ స్టార్ హీరోస్ ఒకేసారి ఒకే సినిమాతో వస్తుండడంతో ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆర్ ఆర్ సెలెబ్రేషన్స్ హై లెవెల్ లో జరుగుతున్నాయి. ముందు ముందు స్కై లెవెల్ లో జరగనున్నాయి.
ఈ సినిమాలో టైగర్ వంటి పాత్రలో తారక్ - హంటర్ వంటి రోల్ లో చరణ్ కనిపిస్తారని ట్రైలర్ లోనే చూసాం కనుక ఇక హంగామా టైగర్ దే - హవా హంటర్ దే అని ఫిక్స్ అయిపోవచ్చు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ ఆంథెమ్ ఎత్తరా జెండా తోనే ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ షురూ కానున్నాయి.
ఇంకా ఈ ఎపిక్ ఫిలిం గురించి మనం పంచుకోవాల్సిన మేటర్ - చెప్పుకోవాల్సిన సీక్రెట్స్ చాలానే ఉన్నాయ్ కాబట్టి ఇకనుంచీ వరుస ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్స్ తో ఫాన్స్ లో జోరునీ జోషునీ పెంచబోతోంది సినీజోష్.
సో... ప్లీజ్ స్టే ట్యూన్..!!