బాహుబలి సినిమా తో నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకున్న ప్రభాస్ ని చూసి చాలామంది బాలీవుడ్ హీరోలు జెలస్ ఫీలయ్యారు. టాలీవుడ్ నుండి వచ్చి బాలీవుడ్ బాక్సాఫీసు మీద దాడి చేసిన ప్రభాస్ కి ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే.. బాలీవుడ్ హీరోలు తెల్లమొహం వేశారు. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారడంతో.. అక్కడి స్టార్ హీరోలు రగిలిపోయారు. ఆ తర్వాత సాహో తో కూడా బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేసారు ప్రభాస్. అన్ని భాషల్లో సాహో ప్లాప్ అయినా.. నార్త్ ఆడియన్స్ సాహో ని హిట్ చెయ్యడంతో.. బాలీవుడ్ హీరోలు మరింతగా కుల్లుకున్నారు. ప్రభాస్ ని అప్రిశేట్ చేసిన కొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రభాస్ ఇమేజ్ ని చూసి లో లోపల ఏడ్చారు.
అయితే అంతగా రగిలిపోయిన బాలీవుడ్ హీరోల అహం చల్లబడింది. ఎందుకంటే ప్రభాస్ రాధే శ్యామ్ బాలీవుడ్ లో బోల్తాపడింది. అక్కడ రాధే శ్యామ్ ని నార్త్ ప్రేక్షకులు తిరస్కరించారు. ఫస్ట్ డే సాహో తో 25 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ రాధే శ్యామ్ తో 5 కోట్ల దగ్గరే ఆగిపోయారు. రెండో రోజు బాలీవుడ్ లో రాధే శ్యామ్ కలెక్షన్స్ మరింత డల్ అయ్యాయి. ఈ వీకెండ్ ముగిస్తే రాధే శ్యామ్ బాలీవుడ్ బాక్సాఫీసు చల్లబడిపోతుంది అని, వచ్చే శుక్రవారం బచ్చన్ పాండే తో రాధే శ్యామ్ హిందీలో ఫైనల్ రన్ పూర్తి చేసుకుంటుంది అంటున్నారు. రాధే శ్యామ్ టాక్ చూసి, రాధే శ్యామ్ కి వస్తున్న కలెక్షన్స్ చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు లో లోపల తెగ ఆనందించేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకొచ్చాయి.