Advertisement
Google Ads BL

కోలీవుడ్ విశాల్ కి భారీ షాక్


కోలీవుడ్ హీరో విశాల్ కి చెన్నై హై కోర్టు భారీ షాకిచ్చింది. అభిమన్యుడు, డిటెక్టీవ్ అంటూ సస్పెన్స్  థ్రిల్లర్ తో ఫామ్ లోకొచ్చిన విశాల్ తర్వాత చేసిన సినిమాలేవీ ఆయనకి సక్సెస్ ఇవ్వలేదు. వరస ప్లాప్స్ తో పాటుగా ఈ మధ్యన షూటింగ్స్ లో విశాల్ గాయాలపాలవుతున్నారు. ఈమధ్యనే లాఠీ షూటింగ్ లో గాయపడిన విశాల్ కేరళ వెళ్లి చికిత్స తీసుకుని వచ్చారు. అయితే తాజాగా విశాల్ కి కోర్టు షాకిచ్చింది. హైకోర్టు రిజిస్ట్రార్ పేరున మూడు వారాల్లో 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లైకా ప్రొడక్షన్ విశాల్ పై కోర్టుకి వెళ్లడంతో కోర్టు 15 కోట్లు డిపాజిట్ చెయ్యమని ఆదేశించింది.

Advertisement
CJ Advs

విశాల్ వీరమే వాగై సుడుం సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ నుంచి 21.29 కోట్లు అప్పు తీసుకున్నారు. అయితే లైకా సంస్థకు విశాల్ అప్పు తీర్చకుండానే వీరమే వాగై సుడుం సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ విక్రయించడానికి రెడీ అవడంతో లైకా ప్రొడక్షన్స్ వారు మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. విశాల్ తమ అప్పు తీర్చేంత వరకు ఆ సినిమాకు సంబంధించిన అన్ని థియేట్రికల్, నాన్ థియోట్రికల్ హక్కులు అమ్మకుండా స్టే విధించాలని కోర్టును విధించింది. దానితో కోర్టు విశాల్ ని 15 కోట్ల రూపాయలని కోర్టు రిజిస్ట్రార్ పేరున మూడు వారాల్లో డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. 

Huge shock to Kollywood Vishal:

Loan dispute: Vishal to deposit Rs 15 crore
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs