Advertisement
Google Ads BL

నాగ బాబు సెన్సేషనల్ ట్వీట్


నాగబాబు ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు, అటు స్టార్ మా లో కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కి జేడ్జ్ గా వస్తున్నారు. గతంలో జబర్దస్త్ కి జేడ్జ్ గా పని చేసిన నాగబాబు మల్లెమాల తో వచ్చిన విభేదాల కారణంగా జీ ఛానల్ కి వెళ్లినా అక్కడ సక్సెస్ అవలేదు. మళ్ళీ స్టార్ మా కి వచ్చారు. అయితే స్టార్ హీరోల సినిమాల్లో మంచి కేరెక్టర్స్ చేస్తూ వస్తున్న నాగబాబు గతంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనకు మద్దతుఇచ్చారు. అలాగే అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే నాగబాబు.. ఇప్పుడు చేసిన ఓ ట్వీట్ చూస్తే గందరగోళంగా అనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

అదేమిటంటే ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు, కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా తోటి ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా.. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది.. అంటూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మరింది.

ఎందుకంటే సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాలకు సమయం కేటాయించబోతున్నారా నాగ బాబు అనే అనుమానం అందరిలో మొదలైంది. ఇక ఈ రోజు జరగబోతే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు హడావిడి చేస్తున్నారు.

Nagababu sensational decision?:

Nagababu sensational tweet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs