Advertisement
Google Ads BL

టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సోనాలి


తెలుగులో మహేష్ బాబు తో మురారి, చిరు తో శంకర్ దాదా ఎంబిబిఎస్, శ్రీకాంత్ తో ఖడ్గం మూవీస్ లో నటించిన సోనాలి బింద్రే.. మూడేళ్ళ క్రితం క్యాన్సర్ బారిన పడింది. సొనాలికి క్యాన్సర్ అనే విషయం తెలిసిన వెంటనే.. ఆమె న్యూయార్క్ వెళ్ళిపోయింది. అక్కడే కొన్నిరోజులు ఉండి సోనాలి బింద్రే క్యాన్సర్ కి చికిత్స తీసుకుంది. మధ్య మధ్యలో తాను క్యాన్సర్ ఎంతగా సఫర్ అవుతున్నానో అనే విషయాన్ని ఫొటోస్ రూపంలో సోనాలి సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఆ పిక్స్ లో తన హెయిర్ మొత్తం ఊడిపోయి కనిపించినా.. ఆమెలోని ధైర్యం చూసి అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసారు.

Advertisement
CJ Advs

అందరి ప్రార్ధనలు ఫలించి సోనాలి క్యాన్సర్ నుండి కోలుకుని నార్మల్ స్టేజ్ లోకి వచ్చెయ్యడమే కాదు, పూర్తి ఆరోగ్యంతో భర్త పిల్లలతో కొన్ని ఈవెంట్స్ కూడా హాజరైంది. కానీ సినిమాల్లోకి మళ్ళీ రాలేదు. గతంలో సొనాలికి టాలీవుడ్ నుండి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చినా ఎందుకో ఆమె చెయ్యలేదు. తాజాగా సోనాలి టాలీవుడ్ కి 18 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని, అది కూడా కొరటాల - ఎన్టీఆర్ కాంబో మూవీ లో సోనాలి ని నటింప చేసేందుకు కొరటాల ప్రయత్నాలు మొదలు పెట్టారని, పాన్ ఇండియా మూవీ కాబట్టి NTR30 లో సోనాలి బింద్రే నటిస్తే హైప్ వస్తుంది అని అనుకుంటున్నారట. ఎలాగూ హీరోయిన్ అలియా భట్ ని బాలీవుడ్ నుండే పట్టుకొచ్చారు. సో సోనాలి ఓకె చెబితే NTR30 తో సోనాలి గ్రాండ్ గా తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చేసినట్టే. 

 

Sonali Bendre tollywood re entry after 18 years :

Sonali Bendre tollywood re entry after 18 years with NTR movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs