డిసెంబర్ లో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ రిలీజ్ తో మొదలు పెట్టిన ప్రమోషన్స్ ని.. ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ చేసారు. తర్వాత చెన్నై లో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ తో హడావిడి చేసిన టీం బెంగుళూర్ లోను ప్రెస్ మీట్ తో ఫాన్స్ కి పిచ్చెక్కించారు. హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రసాభాస కాగా.. తర్వాత ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ తో ఫాన్స్ ని కూల్ చేసారు. అలా డిసెంబర్ లో 20 డేస్ ప్రమోషన్స్ తో రాజమౌళి ఉరుకులు పరుగులు పెట్టి సినిమాపై హైప్ క్రియేట్ చేసారు. ఇక బాలీవుడ్ లో అయితే అక్కడ పాపులర్ టివి షోస్, కామెడీ షోస్ ఆఖరికి జొమాటో లోను ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు.
ఇక ఇప్పుడు మార్చ్ 14 నుండి ప్రమోషన్స్ మొత్తాన్ని మరోసారి మొదలు పెట్టబోతోంది టీం. అయితే డిసెంబర్ లో చేసిన ప్రమోషన్స్ కి మించి ఈసారి కూడా ఆర్.ఆర్.ఆర్ ని ప్రమోట్ చెయ్యాలని చూస్తున్నారట. మార్చ్ 18న దుబాయ్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక, మార్చ్ 19న ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులని కవర్ చేస్తూ బెంగుళూర్ లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారని, ఇంకా ఎంతగా వీలయితే అంతగా ఆర్.ఆర్.ఆర్ ని ఆడియన్స్ లోకి తీసుకువెళ్లాలని రాజమౌళి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత రాజమౌళి.. మళ్ళీ ప్రమోషన్స్ ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా ప్లాన్ చెయ్యాలి అనేదాని మీదే ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.