Advertisement
Google Ads BL

నేచురల్ బ్యూటీకి ఆఫర్స్ లేవే..


నేచురల్ బ్యూటీ, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి కి ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. గత ఏడాది శ్యామ్ సింగ రాయ్ సినిమాలో రోజీ గా అద్భుతమైన పెరఫార్మెన్స్ తో, నాట్యం తో అందరి మన్ననలు అందుకున్న సాయి పల్లవి కి ఛాన్స్ ఇచ్చేవారు కరువయ్యారు. టాలెంట్ ఉంది, అందం ఉంది, డాన్స్ చెయ్యగల సత్తా ఉంది. అయినా ఆమెకి అవకాశాలు రాకపోవడం విడ్డురమే. సాయి పల్లవి నటించిన విరాట పర్వం కూడా రిలీజ్ అయితే సాయి పల్లవి ఖాళీ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ డేట్ విషయం తేల్చకుండా మేకర్స్ ఇంకా ముసుగులో గుద్దులాటలా సస్పెన్స్ లో పెడుతున్నారు.

Advertisement
CJ Advs

మరి సాయి పల్లవి టాలెంట్ కి స్టార్ హీరోలు భయపడుతున్నారా? లేదంటే ఆమె గ్లామర్ గా కనిపించలేదు, రొమాంటిక్ సీన్స్ కి నో చెబుతుంది, లేదంటే ఆమె పెరఫార్మెన్స్ ముందు మనం తేలిపోతామని భయంతోనే ఆమెని ప్రిపేర్ చెయ్యడం లేదా? యంగ్ హీరోలు కూడా సాయి పల్లవి డామినేషన్ కి భయపడుతున్నారా? అందుకే ఆమెకి ఆఫర్స్ దొరకడం లేదా? తెలుగులో సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ బ్యూటీని పక్కనపెట్టడం మాములు విషయం కాదు. నిన్నగాక మొన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఈవెంట్ లో స్టార్ హీరోల కున్న ఫాన్స్ లాగా సాయి పల్లవి స్టేజ్ ఎక్కగానే ఆమె ఫాన్స్ నానా రచ్చ చేసారు. సాయి పల్లవి పై అభిమానం చూసిన కీర్తి సురేష్, టాప్ హీరోయిన్ రశ్మికనే షాక్ అయ్యారు. డైరెక్టర్ సుకుమార్ అయితే లేడీ పవన్ కళ్యాణ్ అంటూ పొగిడారు కానీ.. అవకాశం మాత్రం ఇస్తా అనలేదు. ఈ నేచురల్ బ్యూటీని అందరూ లైట్ తీసుకోవడం ఆమె ఫాన్స్ కి ఆందోళన కలిగిస్తుంది. 

There are no offers for Natural Beauty:

Sai Pallavi with no offers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs