Advertisement
Google Ads BL

పూజ హెగ్డే కి గట్టి షాకే


గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానాన్ని ఆక్రమించడానికి రెడీ అయిన పూజ హెగ్డే కి పాన్ ఇండియా ఫిలిం రాధే శ్యామ్ గట్టి షాకే ఇచ్చింది. పెరఫార్మెన్స్ ఎలా ఉన్నా.. గ్లామర్ పాత్రల తోనే స్టార్ ఛాన్సెస్ ని దక్కించుకుని బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల అవకాశాలతో.. కళకళాడుతున్న పూజ హెగ్డే కి లక్కు కన్నా గ్లామర్ ఆమెకి హెల్ప్ చేసింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ గ్లామరే ఆమె కొంప ముంచింది. పూజ హెగ్డే చేసిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ ఆమెకి హిట్ ఇవ్వకపోగా.. ఆమెని విమర్శల పాలు చేసింది. రాధే శ్యామ్ మెయిన్ మైనస్ పాయింట్స్ లో హీరోయిన్ పూజ హెగ్డే ఉంది అంటేనే ఆమె కేరెక్టర్ ఎలా ఉందో అర్ధమైపోతుంది. 

Advertisement
CJ Advs

ప్రేరణగా పూజ హెగ్డే అటు పెరఫార్మెన్స్ పరంగాను, ఇటు లుక్స్ విషయంలోనూ రాధే శ్యామ్ లో తేలిపోయింది అనే విమర్శలు మూటగట్టుకుంది. అదే సినిమాకి హిట్ టాక్ వచ్చి ఉంటే.. ఆమె ఎలా ఉన్న అందులో కొట్టుకుపోయేది. కానీ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు వెతికే పనిలో ముందుగా పూజ హెగ్డే దగ్గరే ఆగుతున్నారు. అటు లుక్స్ పరంగాను పూజ హెగ్డే ని విమర్శించేస్తున్నారు. కోట్లు డిమాండ్ చెయ్యడం కాదు.. ముందు లుక్ పై కాన్సంట్రేట్ చెయ్యమ్మా అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. పూజ హెగ్డే కి ఏదో ఒక భాషలో సినిమాకి ఇలాంటి టాక్ వచ్చినా పర్లేదు కానీ.. ఏకంగా పాన్ ఇండియా ఫిలిం కే ఇలాంటి విమర్శలు రావడం షాకిచ్చే విషయమే. 

Pooja Hegde Gives A Shock:

Pooja Hegde Gives Shock to Radhe Shyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs