సమంత గత రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్. బాలీవుడ్ లో జరిగిన ఓ ఫంక్షన్ కి గ్లామర్ గా హాజరైన సమంత ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ రేంజ్ అందాలు ఆరబోసి ఔరా అనిపించింది. అయితే సమంత రేంజ్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ , హాలీవుడ్ అంటూ పాకిపోయింది. నాలుగు భాషల సినిమాలతో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత.. బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. హాలీవుడ్ సిరీస్ సిటడెల్ కు ఇండియన్ వెర్షన్ కి రాజ్ అండ్ డీకే లు డైరెక్ట్ చేస్తున్నారు. దానిలో సమంత - వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తుంది. ఆ ప్రాజెక్ట్ కోసమే ప్రెజెంట్ సమంత ముంబై లోనే మకాం వేసింది.
అయితే గత రాత్రి రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ చర్చల కోసం సమంత వారితో మీటయ్యారు. ఆ మీటింగ్ పూర్తయ్యాక సమంత, వరుణ్ వాళ్ళు వచ్చేస్తుంటే.. అక్కడే కాపు కాచిన మీడియా సమంత ని ఫొటోస్ తియ్యడానికి పోటీపడ్డారు. దానితో వరుణ్ ధవాన్ సమంత కి బాడీ గార్డ్ లా మారిపోయి ఆమెని సేవ్ చేస్తున్నట్టుగా.. హేయ్..హేయ్.. జరగండి..జరగండి. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నారు? భయపెట్టకండి అంటూ ఫోటో గ్రాఫర్స్ తో వరుణ్ ఫన్ చేసారు. అంతేకాకుండా సమంత కారు వరకు వరుణ్ ధావన్ సమంత పక్కనే బాడీ గార్డ్ లా ప్రొటెక్ట్ చేసారు. ప్రస్తుతం వరుణ్ సమంత ని సేవ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.