ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం రాధే శ్యామ్ నిన్న మార్చ్ 11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్, సాహోతో దానిని నిలబెట్టుకుని రాధే శ్యామ్ అంటూ ఆడియన్స్ ఏముందుకు వచ్చారు. రాధే శ్యామ్ రిలీజ్ టెంక్షన్స్ తీరిపోవడంతో ప్రభాస్ తన తదుపరి ప్రోజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నారు. వరస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న ప్రభాస్ కామెడీ డైరెక్టర్ మారుతీ తో ఓ మూవీ చెయ్యబోతున్నారు. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా చెయ్యబోతున్నారు అనే గాసిప్ ఉంది.
అయితే ఈ సినిమాకి ప్రభాస్ వర్కింగ్ డేస్ తక్కువగా ఉండడంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ఓకె చేసారని.. ఈ సినిమా ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని, అలాగే ఈ సినిమా కోసం వేసిన ఓ స్పెషల్ సెట్ లో మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేస్తారని, ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండి రాధే శ్యామ్ కి నేపధ్య సంగీతం అందించిన, ఎస్ ఎస్ థమన్ మరోసారి ప్రభాస్ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మారుతీ - ప్రభాస్ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని.. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా త్వరలోనే రాబోతుంది అని సమాచారం