పాన్ ఇండియా మూవీస్ హడావిడి మొదలయ్యింది.. అందులో ముందుగా రాధే శ్యామ్ రిలీజ్ అయ్యింది, దాని హడావిడి సద్దుమణిగింది. కానీ మరో పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ హడావిడి మొదలు కాబోతుంది. మార్చ్ 14 న మహాజాతర కు ముహూర్తం పెట్టారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ లపై చిత్రీకరించిన సెలెబ్రేషన్స్ ఆంథెమ్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఆ సాంగ్ తోనే ప్రమోషన్స్ మోత మోగించడానికి టీం రెడీ అవుతుంది. దుబాయ్ వేదికగా మార్చ్ 18 న బూర్జా ఖలీఫా లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆంధ్ర - కర్ణాటక బోర్డర్ లో మార్చి 19 న మరో ఈవెంట్ తో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని ఎల్లలు దాటించనున్నారు.
ఫాన్స్ లోనే కాదు, పాన్ ఇండియాలోని ప్రతి ఆడియెన్ లోను ఆర్.ఆర్.ఆర్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఓవర్సీస్ లో అయితే ఎన్టీఆర్ ఫాన్స్ చేసే హడావిడి, కెనడాలో ఆర్.ఆర్.ఆర్ కోసం ఫాన్స్ చేసే రచ్చ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మార్చ్ 24 నే ఆర్.ఆర్.ఆర్ ప్రీమియర్స్ తో ఓవర్సీస్ లో రచ్చ మొదలు కాబోతుంది. అక్కడ ఓవర్సీస్ లో ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం RRR ప్రీమియర్స్ వన్ మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేసింది అని.. ఇలా సినిమా ప్రీమియర్స్‌లో వన్ మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేయడం అది కూడా కరోనా సమయంలో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అనేది మాములు విషయం కాదు. ఇలాంటివి చూసినప్పుడే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది.