నందమూరి నటసింహం ఈ మధ్యన స్టైలిష్ లుక్స్ తోనే ఫాన్స్ కి స్వీట్ సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. నందమూరి ఫాన్స్ బాలయ్య స్టయిల్ కి, ఆయన వేస్తున్న మాసివ్ పవర్ ఫుల్ కేరెక్టర్స్ చూసి పండగ చేసుకుంటున్నారు. అఖండ మూవీ లో అఘోర కేరెక్టర్ తో శివతాండవం చేసిన బాలయ్య బాబు, ఆహా అన్ స్టాపబుల్ షో లో అద్భుతమైన స్టైలిష్ లుక్ లో అలరించారు. తర్వాత NBK 107 లో బాలకృష్ణ తన సెంటిమెంట్ ని పక్కనబెట్టి మరీ కేరెక్టర్ కోసం బ్లాక్ డ్రెస్ వేస్తున్నారంటే.. ఆ కేరెక్టర్ కి ఎంత ఇంపోర్టన్స్ ఉందో అర్ధమైపోతుంది.
బాలయ్య బాబు కి సెంటిమెంట్స్ ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఫస్ట్ టైం గోపీచంద్ మలినేని డిజైన్ చేసిన కేరెక్టర్ కోసం బాలయ్య బ్లాక్ డ్రెస్ వేశారు. ఆ సినిమాలో బాలయ్య ఫస్ట్ లుక్ కి భీబత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రెండు కేరెక్టర్స్ చేస్తున్న బాలయ్య ఓ కేరెక్టర్ లో స్టైలిష్ గాను, మరో కేరెక్టర్ లో పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. అఖండ 100 డేస్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బోయపాటి, నిర్మాతలు బాలయ్యని NBK 107 సెట్ లో కలిసి బొకే ఇచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సెట్ లో బాలయ్య బ్లాక్ షర్ట్ లో, లుంగీలో, అదిరిపోయే హెయిర్ స్టయిల్ లో కనిపించగానే.. ఫాబ్యులస్ ఫామ్ లో నందమూరి నటసింహం, కిర్రాక్ లుక్ తో కిక్కిస్తోన్న బాలయ్య, కొత్త ఉత్తేజంతో నందమూరి నటసింహం అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.