Advertisement
Google Ads BL

6 రీజన్స్ టు వాచ్ రాధే శ్యామ్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గ్లామర్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన అత్యద్భుతమైన ప్రేమకథ రాధే శ్యామ్. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాధే శ్యామ్ ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాను చూడడానికి 6 ప్రధానమైన కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement
CJ Advs

1. క్యూట్ లవ్ స్టోరీ:

తెలుగు ఇండస్ట్రీలో మంచి ప్రేమ కథ చూసి చాలా రోజులైంది. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ ఇది. అందులోనూ ఇండియాలో ఇప్పటివరకు ఇంత భారీ బడ్జెట్ తో వచ్చిన ప్రేమ కథ మరొకటి లేదు. విజువల్ ఫీస్ట్ గా రాధే శ్యామ్ వచ్చింది.

2. ప్రభాస్ లుక్స్ & స్టైలింగ్:

నిన్న మొన్నటి వరకు మాస్ యాక్షన్ హీరోగా నటించిన రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కోసం అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఆయన లుక్స్, స్టైలింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

3. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ:

ఏదైనా ప్రేమకథ సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా కెమిస్ట్రీ బాగుండాలి. రాధే శ్యామ్ సినిమా విషయంలో ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

4. విజువల్ ఎఫెక్ట్స్ & ఆర్ట్ వర్క్:

రాధే శ్యామ్ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. క్లైమాక్స్ అత్యద్భుతంగా వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. మరోవైపు ఆర్ట్ డిపార్ట్మెంట్ వరకు కూడా అద్భుతం. సినిమా అంతా చాలా అందమైన సెట్లు కనిపించాయి. ఈ విషయంలో రవీందర్ పనితీరు అందరూ మెచ్చుకోవాల్సిందే. అలాగే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు మరో మేజర్ హైలైట్.

5. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం & తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్:

లవ్ స్టోరీ ప్రేక్షకుల గురించి కావాలంటే ముఖ్యంగా కావలసింది మ్యూజిక్. జస్టిన్ ప్రభాకరన్ తనపై దర్శక నిర్మాతలు పెట్టిన నమ్మకాన్ని వందకు వంద శాతం ప్రూవ్ చేసుకున్నాడు. అద్భుతమైన పాటలు ఇచ్చాడు. మరోవైపు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్.

6. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్:

కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ఇలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా లవ్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఒకవైపు ప్రభాస్ ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ.. మరోవైపు తాను రాసుకున్న కథకు సరిగ్గా న్యాయం చేశాడు ఈయన. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించాడు. డెస్టిని మన చేతిలో ఉండదు.. మన చేతుల్లో ఉంటుందని చూపించాడు ఈయన.

ఇది మాత్రమే కాదు కృష్ణంరాజు గారి కీలకమైన పాత్ర కూడా సినిమాకు మరో అదనపు ఆకర్షణ. అందమైన కథ.. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే.. వినసొంపైన సంగీతం అన్ని కలిపి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే లవ్ స్టోరీ ఈ రాధే శ్యామ్

6 Reasons to Watch Radhe Shyam:

Radhe Shyam release today
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs