హీరోలందరికీ మాస్ ఇమేజ్ ఉంటే.. మాస్ ఫాన్స్ ఆ సినిమాలకి సో సో టాక్ వచ్చినా హిట్ చేసేస్తారు. అదే క్లాస్ ఆడియన్స్ మాత్రం నచ్చితేనే ఆ సినిమాని హిట్ చేస్తారు. అందుకే ప్రతి హీరో మాస్ ఇమేజ్ కోసం తాపత్రయ పడతారు. పవన్ కళ్యాణ్ కి మాస్ ఇమేజ్ కావాల్సినంత ఉంది. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే.. థియేటర్స్ దగ్గర జాతరని తలపిస్తుంది. పాలాభిషేకాలు, పవన్ కళ్యాణ్ భారీ కటౌట్స్ అబ్బో మాములుగా ఉండదు రచ్చ. అయితే లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఫాన్స్ లో ఊపుకనిపించదు. అంత ఇదిగా రచ్చ చెయ్యరు. బాహుబలిలాంటి భారీ పాన్ ఇండియా మూవీ సక్సెస్ తో ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత ఆ లెవెల్ కి తగ్గ మాస్ మూవీ సాహో చేసారు. యాక్షన్ ప్రధానంగా సాగిన సాహో మూవీ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోయినా.. ఆ సినిమాని ఎలాగోలా గట్టెక్కించారు. సౌత్ లో సాహో అటు ఇటు అయినా.. నార్త్ ప్రేక్షకులు సాహో ని హిట్ చేసారు.
రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ అంటూ ప్యూర్ లవ్ స్టోరీ తో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే భీమ్లా నాయక్ విడుదలవుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఉన్న అలజడి, థియేటర్స్ దగ్గర ఉన్న హడావిడి అయితే రాధే శ్యామ్ థియేటర్స్ దగ్గర కానీ, సోషల్ మీడియాలో కానీ కనిపించలేదు. అంటే రాధే శ్యామ్ మీద క్రేజ్ లేకనా.. మాస్ మూవీ కాదు, లవ్ స్టోరీ మనకెందుకులే అనా.. ఏదైనా ప్రభాస్ ఫాన్స్ రాధే శ్యామ్ రచ్చ తో రికార్డులు సృష్టిస్తారు అనుకుంటే.. అసలు రాధే శ్యామ్ విడుదలవుతుంది అనే ఇంట్రెస్ట్ అయితే ఆడియన్స్ లో కనిపించలేదు. ఎదో ఓ పెద్ద సినిమా వస్తుందిలే అన్నట్టుగా ఉంది వ్యవహారం.