ఇప్పుడు ఆడియన్స్ లో రాధే శ్యామ్ రిలీజ్ టెంక్షన్ కన్నా.. ప్రభాస్ పెళ్లి టెంక్షన్ ఎక్కువగా కనబడుతుంది. మరి ప్రభాస్ ఏం యంగ్ కుర్రాడు కాదు కదా.. మరో ఏడాది ఆగి పెళ్లి గురించి అడగడానికి, ఆలోచించడానికి. ప్రభాస్ కి పెళ్లి వయసు దాటి చాలా రోజులైపోయింది. కానీ ప్రభాస్ పెళ్లి ఊసెత్తడు. కానీ రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో ప్రభాస్ కి అడుగడుగునా పెళ్లి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఆరడుగుల అందగాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో ఓ నేషనల్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ పెళ్లి పై ఓపెన్ అయ్యారు.
తాను పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాను అని, అయితే ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్... అది ఎప్పుడు అన్నదానిపై మాత్రం ఖచ్చితంగా చెప్పలేను అంటూ మళ్ళీ కన్ఫ్యూజ్ చేసారు.. బాహుబలి సినిమా తర్వాత ఏకంగా మీకు 5వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయట కదా అని అడగ్గా.. అవునండి చాలా ప్రపోజల్స్ వచ్చాయి.. ఇదో పెద్ద కన్‌ఫ్యూజన్ అంటూ పెళ్లి పై తన అభిప్రాయాన్ని ప్రభాస్ ఇలా బయటపెట్టారు.