Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ సెట్స్ లోకి సల్మాన్ ఖాన్


మెగాస్టార్ చిరు - మోహన్ రాజా కాంబోలో మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ని తెలుగు నేటివిటీకి దగ్గరగా గాడ్ ఫాదర్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అన్నిటికన్నా స్పెషల్ ఏమిటి అంటే లేడీ సూపర్ స్టార్ నయనతార చిరు కి సిస్టర్ కేరెక్టర్ లో పవర్ ఫుల్ రోల్ లో నటించడం. మరొక స్పెషల్ ఏమిటి అంటే.. చిరుకి బాడీ గార్డ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించడం. ఇన్ని స్పెషల్స్ ఉన్న గాడ్ ఫాదర్ మూవీ షూట్ లో గత నెలలోనే నయనతార జాయిన్ అవడం కీలకమైన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చెయ్యడం జరిగిపోయింది. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సెట్స్ లోకి సల్లూ భాయ్ అదేనండి.. సాలిడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

మార్చ్ 12న కర్జాత్ లోని ND స్టూడియోస్ లో సల్మాన్ ఖాన్ తో మెగాస్టార్ కాంబో సీన్స్ ని దర్శకుడు మోహన్ రాజా చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తుంది. మరి నయనతార - సల్మాన్ ఖాన్ కూడా గాడ్ ఫాదర్ లో భాగమవడంతో.. ఈ రీమేక్ పై అంచనాలు పెరిగిపోయితున్నాయి. అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ ని రెండు మూడు భాషల్లో విడుదల చెంసేందుకే ఇలాంటి కాంబోని మోహన్ రాజా సెట్ చేసారని, గాడ్ ఫాదర్ మూవీ తెలుగు తో పాటుగా తమిళ్, హిందీలో రిలీజ్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Godfather: Chiranjeevi, Salman tango to start:

Godfather: Chiranjeevi, Salman raring to show the power
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs