Advertisement
Google Ads BL

సమంత రెమ్యునరేషన్ చూస్తే షాకే


అక్కినేని ఫ్యామిలీ నుండి బయటికి వచ్చి.. ఇంటి పేరుని మార్చేసుకున్న సమంత తర్వాత కెరీర్ ని ఓ రేంజ్ లో చక్కబెట్టుకుంటుంది. పెళ్లి తర్వాత బోల్డ్ కేరెక్టర్స్ కి కొద్దిగా దూరం పాటించిన  సమంత.. విడాకుల తర్వాత మాత్రం ఆ బోల్డ్ అండ్ గ్లామర్ కేరెక్టర్స్ తోనూ, స్పెషల్ సాంగ్స్ తోనూ, విమెన్ సెంట్రిక్ మూవీస్ తో గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తుంది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ రేంజ్ కి పెరిగిన సమంత క్రేజ్..చూసిన వారు కుళ్ళుకునేలా ఉంది ఆమె కెరీర్. క్రేజ్ ఉన్నప్పుడు ఎంత డిమాండ్ చేసినా.. నిర్మాతలు ఇచ్చేస్తారు. అందుకే సమంత తన పారితోషకాన్ని పెంచేసిందట.

Advertisement
CJ Advs

అది కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార అందుకుంటున్న రెమ్యునరేషన్ కి కొద్దిగా తక్కువగా సమంత రెమ్యునరేషన్ ఉంది అని అంటున్నారు. సౌత్ హీరోయిన్స్ లో నయనతార నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడమే కాదు, పారితోషకం విషయంలో స్టార్ హీరోల రేంజ్ ఉంది ఆమెకి. ఆ తర్వాత ఇప్పుడు సమంత ఆ రేంజ్ పారితోషకం అందుకుంటుంది అని, ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్, బై లింగువల్ మూవీస్ చేస్తున్న సమంత ఒక్కో సినిమాకి మూడు నాలుగు కోట్లు అందుకుంటుందట. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం రిలీజ్ కి రెడీ అవుతుంటే.. తమిళంలో నయన్ తో నటించిన మూవీ కూడారిలీజ్ కి రెడీ అయ్యింది. సమంత మరో మూవీ యశోద సెట్స్ మీదుంది. అలాగే వెబ్ సీరీస్ తో పాటుగా, హాలీ వుడ్ మూవీ ఒకటి సామ్ చేతిలో ఉంది. 

Shocking Remuneration For Samantha:

Samantha Allegedly Demands Huge Remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs