Advertisement
Google Ads BL

అఖండ 100 డేస్ జాతర


బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అఖండ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. డిసెంబర్ లో విడుదలైన అఖండ మూవీ మాస్ జాతరని తలపించే కలెక్షన్స్, థియేటర్స్ దగ్గర ఆడియన్స్ రచ్చ తో కళకళలాడింది. అఖండ మూవీలో అఘోర గా బాలయ్య చేసిన శివ తాండవం, థమన్ ఇచ్చిన మాస్ మ్యూజిక్ కి థియేటర్స్ బాక్స్ లు బద్దలైపోయాయి. ఈమధ్యకాలంలో కరోనా పాండమిక్ సిట్యువేషన్, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించినా.. అన్ని గండాలను దాటుకుని సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న మూవీ గా అఖండ చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు ఆ అఖండ 100 రోజుల మాస్ జాతరకు రెడీ అయ్యింది. 

Advertisement
CJ Advs

ఈ నెల 12న అఖండ 100 డేస్ జాతరకు ముహూర్తం తో పాటుగా ప్లేస్ ఫిక్స్ చేసారు మేకర్స్. మార్చ్ 12 న STBC గ్రౌండ్స్ కర్నూలులో కృతజ్ఞత సభ నిర్వహించబోతున్నట్లుగా  ప్రకటించారు. మాస్ ఫాన్స్ మెచ్చిన అఖండ 100 డేస్ సెలెబ్రేషన్స్ అదే మాస్ అభిమానుల మధ్యన అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. అఖండ రిలీజ్ అయ్యాక సక్సెస్ సెలెబ్రేషన్స్, సక్సెస్ టూర్ అంటూ బాలకృష్ణ - బోయపాటి నిర్మాతలు అఖండ ని ఫుల్ గా పబ్లిసిటీ చేసారు. ఇప్పుడు 100 రోజులు పూర్తవ్వబోతున్న సందర్భంగా ఆ సెలెబ్రేషన్స్ ని కృతజ్ఞత సభగా నిర్వహించబోతున్నారు.

Akhanda Kruthagnatham Sabha:

Akhanda Kruthagnatham Sabha to held on 12th March!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs