Advertisement
Google Ads BL

RC 15 టైటిల్ అదేనా?


రామ్ చరణ్ ప్రెజెంట్ తన వైఫ్ అలాగే తన కో బ్రదర్ ఫ్యామిలీ తో ఫిన్లాండ్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఉపాసన సిస్టర్ కి ఈమధ్యనే పెళ్లయ్యింది. ఆమె తన హస్ బండ్, అక్క ఉపాసన, బావ చరణ్ తో కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ వెకేషన్ నుండి రాగానే.. రాజమౌళి, ఎన్టీఆర్ లతో కలిసి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. మార్చ్ 25 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని రాధే శ్యాం రిలీజ్ అవ్వగానే మొదలు పెట్టబోతున్నారట. ఇక ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ముగిసిన వెంటనే రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రెటీన్స్ మొదలవుతాయి.

Advertisement
CJ Advs

ఆ తర్వాత రామ్ చరణ్ కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ తో చెయ్యబోయే RC 15 కొత్త షెడ్యూల్ లో పాల్గొంటారట. రామ్ చరణ్ - శంకర్ కాంబోలో RC15 ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమిషనర్ గాను, విలన్ ఎస్ జె సూర్య సీఎం కేరెక్టర్ లో కనిపించబోతున్నారనే న్యూస్ ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గా శంకర్ మూడు భాషలకు సరిపోయే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. అది సర్కారోడు అనే పవర్ ఫుల్ టైటిల్ ని RC 15 కి పెట్టబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి మహేష్ బాబు అదే టైటిల్ కి దగ్గరగా సర్కారు వారి పాట చేస్తున్నారు. రామ్ చరణ్ సర్కారోడు టైటిల్ ని ఒప్పుకుంటారో లేదో చూద్దాం. 

Speculation of RC15 title:

RC15 title: Will Ram Charan agree to Mahesh shades?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs