Advertisement
Google Ads BL

సీనియర్ హీరోలకే సెటిలయ్యేలా ఉంది


హీరోయిన్ గా మాంచి ఫామ్ లో ఉన్నప్పుడే..  బాయ్ ఫ్రెండ్ తో చట్టాపట్టాలేసుకుని తిరిగి తర్వాత బ్రేకప్ అవ్వడంతో ఆల్కహాల్ కి బానిసై కెరీర్ ని పాడుచేసుకుంది శృతి హాసన్. పవన్ తో నటించిన కాటమరాయుడు మూవీ ప్లాప్ తరవాత ఆమె ఇండస్ట్రీలో చాలా రోజులు కనిపించలేదు. మళ్ళీ రవితేజ క్రాక్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీస్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో శృతి హాసన్ కి వెంటనే ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో లక్కీ ఛాన్స్ దొరికింది. ఇక మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తుంది శృతి హాసన్ అనుకునేలోపే.. బాలకృష్ణ తో NBK 107 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయ్యో బాలయ్య పక్కన శృతి హాసనా అని ఆమె ఫాన్స్ కాస్త డిస్టర్బ్ అయ్యారు. అలాగే సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోస్ తో ఆక్టివ్ గా మారిన శృతి హాసన్ మరో బాయ్ ఫ్రెండ్ శాంతాను తో కలిసి ఎంజాయ్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే శృతి హాసన్ ఫామ్ లో కొస్తుంది. ఆమె కెరీర్ మళ్ళీ యంగ్ హీరోల సినిమాలతో టర్న్ అవుతుంది అనుకుంటే మళ్ళీ మెగాస్టార్ చిరు తో కలిసి మెగా 154 లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గతంలో ఈ సీనియర్ హీరోలతో కాజల్ జత కట్టేది. చిరు రెండు సినిమాలు, నాగ్ తో ఓ సినిమా చెయ్యడానికి ఒప్పేసుకున్న కాజల్.. చిరు సినిమా పూర్తి చేసి నాగ్ సినిమా నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆ కాజల్ స్థానాన్ని శృతి హాసన్ భర్తీ చేస్తుంది అనేలా వరసగా సీనియర్ హీరోల సినిమాలతో శృతి బిజీ అయ్యింది. 

Shruti haasan turning the first option for tollywood senior heroes:

Shruti Haasan to romance Chiru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs