Advertisement
Google Ads BL

రణవీర్ సింగ్ కూడా తగ్గేదే లే


అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీ తో సృష్టించిన సంచలనాలు మరో సినిమాకు సాధ్యం కాలేదు. ఎక్కడ చూసినా కూడా పుష్ప పేరు వినిపించింది. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ #ThaggedheLe, #MainJhukegaNahi అంటూ పుష్ప సినిమా డైలాగ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. కేవలం ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియా మాత్రమే కాదు క్రికెట్ లో కూడా చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పుష్ప మేనరిజమ్స్ ఫాలో అయ్యారు. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సహా చాలామంది ఫేమస్ క్రికెటర్స్ పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి గ్లోబల్ వైడ్ ట్రెండింగ్ చేశారు.

Advertisement
CJ Advs

మొన్న ఇండియా, శ్రీలంక మ్యాచ్ లో రవీంద్ర జడేజా సెంచరీ చేసిన తర్వాత, వికెట్ తీసిన తర్వాత తగ్గేదే లే అంటూ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అలాగే ఐఎస్ఎల్ లో భాగంగా ఫుట్బాల్ ఫీల్డ్ లోనూ గోల్ వేసిన తర్వాత శ్రీవల్లి స్టెప్ చేశారు. పుష్ప సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు తమకు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు.

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేయడం మాత్రమే కాదు.. అక్కడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది పుష్ప. బాలీవుడ్ ప్రముఖులు వరుసగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అంతే కాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ హీరో రణవీర్ సింగ్ కూడా తగ్గేదే లే అనేశాడు.

రాజకీయ నాయకులు కూడా పుష్ప సినిమా డైలాగులు తమ ప్రచారంలో వాడుకుంటున్నారు. ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ స్పీచ్ ఇస్తున్నారు. ఓ పొలిటికల్ ర్యాలీలో మన డిఫెన్స్ మినిస్టర్ కూడా పుష్ప డైలాగ్స్ బాగానే వాడుకున్నారు. క్రికెటర్స్, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా పుష్ప సినిమా పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమాను ఒక పండగలా సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఇప్పట్లో ఈ క్రేజు తగ్గేలా కనిపించడం లేదు. శ్రీవల్లి హుక్ స్టెప్ 3 మిలియన్ రీల్స్ కు చేరువైంది.

Pushpa becomes an iconic movie in Indian film history :

Allu Arjun Pushpa becomes an iconic movie in Indian film history 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs