Advertisement
Google Ads BL

నువ్వు నా డార్లింగ్.. నీకోసం ఏమైనా చేస్తా


డార్లింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్ కాస్తా బాహుబలి ప్రభాస్ గా పేరుపొందింది.. అమ్మాయిలు మాత్రం డార్లింగ్ అనే పిలుస్తారు. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ప్రమోషన్స్ మంచి ఊపులో ఉన్నాయి. మరొక్క రెండు రోజుల్లో భారీగా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో ప్రభాస్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజ్ రావాలంటే విడుదలయ్యే అన్ని భాషల్లో రాధే శ్యామ్ ని బాగా ప్రమోట్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో టీం ఉంది. ఆ ప్రమోషన్స్ లో భాగంగానే బాహుబలి రాజమౌళి తో ప్రభాస్ ఇంటర్వ్యూ ఒకటి జరిగింది.

Advertisement
CJ Advs

మరి బాహుబలితో ప్రత్యేకమైన రికార్దులని సొంతం చేసుకున్న డైరెక్టర్ ఆర్.ఆర్.ఆర్ ఇండియా మూవీ తోనూ, హీరో రాధే శ్యామ్ పాన్ ఇండియా మూవీ తో జస్ట్ 15 డేస్ గ్యాప్ లోఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అలాంటి సమయంలో వారిద్దరూ కలిసి ఇంటర్వ్యూ లో కూర్చుంటే ఆ క్యూరియాసిటీ, క్రేజ్ అంచనా వెయ్యడం కష్టం. రాజమౌళి - ప్రభాస్ ఇంటర్వ్యూ మాంచి ఇంట్రెస్టింగ్ గా నడిచినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ప్రభాస్ రాజమౌళిని.. మీ ఆర్.ఆర్.ఆర్ కూడా రిలీజ్ కాబోతుంది.. మరి మీ సినిమా వదిలేసి నా రాధే శ్యామ్ ని ప్రమోట్ చేస్తున్నారు ఎందుకో తెలుసుకోవచ్చా అంటూ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడగగా.. దానికి రాజమౌళి.. నువ్వు డార్లింగ్ వి నీ కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ చెప్పేసరికి ప్రభాస్ ఫిదా అయ్యిపోయారు. 

Prabhas and SS Rajamouli Reunite For Radhe Shyam Special Interview:

Prabhas - Rajamouli Interview about Radhe Shyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs