Advertisement
Google Ads BL

ఉమెన్స్ డే రోజు అనసూయ ట్వీట్ హైలెట్


అనసూయ అంటే అందమే కాదు.. అంతకు మించిన పొగరు, గ్లామర్ కూడా. జబర్దస్త్ స్టేజ్ పైనే కాదు, వెండితెర మీద కూడా పవర్ ఫుల్ రోల్స్ తో అనసూయ బాగా పాపులర్ అవుతుంది. అలాగే తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారి తాట తీసి వదిలిపెడుతుంది. వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ చుక్కలు చూపెడుతుంది. తనపై మహిళలపై కించపరిచే విధంగా ట్రోల్ చేస్తే.. వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

ట్రోలర్స్, మీమ్స్ చేసుకునే వాళ్ళకి సడన్ గా మహిళా దినోత్సవం రోజున మహిళలని గౌరవించాలనే ఆలోచన వచ్చేస్తుంది. ఈ ఒక్క రోజు మాత్రమే వారు మహిళలని గౌరవిస్తారు. మహిళలు, వాళ్ళ విలువ ఏమిటో ఒక్కసారిగా గుర్తించే రోజుగా భావిస్తారు. వారిలో మహిళల పట్ల ఈ గౌరవం, ఈ భావం కేవలం 24 గంటలు మాత్రమే.. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే మహిళలని ట్రీట్ చేస్తారని.. సో ఈ రోజు హ్యాపీ ఫూల్స్ డే అంటూ అనసూయ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ అవ్వగా.. కొంతమంది అనసూయకి సపోర్ట్ గా మాట్లాడుతుంటే.. మరికొందరు.. అనసూయ ఎప్పుడు ఇంతే అని లైట్ తీసుకుంటున్నారు.

Anasuya Bharadwaj Tweet as Fools Day on Women's Day:

Anasuya wishes Happy Fools Day on Women's Day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs