సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు, ప్రముఖ నటుడు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్ తో 18 ఏళ్ళ బంధానికి తెగతెంపులు చేసుకుని విడాకులు తీసుకున్న ఐశ్వర్య ఆ తర్వాత హైదరాబాద్ వర్క్ పనిమీద కొన్నాళ్ళు ఓ హోటల్ లో ఉన్నారు. అటు ధనుష్ కూడా సర్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే స్టే చేసారు. కానీ ఒకరిని ఒకరు కలుసుకోలేదు. ఇక మొన్నీమధ్యనే ఐశ్వర్య - ధనుష్ లు ఒకే పార్టీకి హాజరవగా.. అందరూ వీరిద్దరూ మాట్లాడుకుంటారేమో అనుకుని ఎదురు చూడగా.. వారికి నిరాశే మిగిల్చారు. అటు ఐశ్వర్య తన సోషల్ మీడియాలో ధనుష్ పేరు తియ్యలేదు. అలాగే వారిని కలపడానికి ఏవో ప్రయత్నాలు కూడా జరిగినట్టుగా చెప్పుకున్నారు.
అయితే రీసెంట్ గా ఐశ్వర్య కోవిడ్ బారిన పడి ఆసుపత్రి పాలైంది. గతంలోనూ ఐశ్వర్య కి కోవిడ్ రాగా.. ఆమె ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరోసారి ఆమె కోవిడ్ బారిన పడడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. జీవితం అనేది కోవిడ్‌కు ముందు, కోవిడ్‌కు తర్వాత అన్నట్టుగా అయిపోయింది. మరోసారి జ్వరంతో ఆసుపత్రిలో చేరా అంటూ ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆమె ఆసుపత్రిలో చేరింది అని తెలియగానే సూపర్ స్టార్ ఫాన్స్ ఆమె త్వరగా కోలుకుని రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.