Advertisement
Google Ads BL

రాధే శ్యామ్ కి గుడ్ న్యూస్


మరో మూడు రోజుల్లో రాధే శ్యామ్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రాధే శ్యామ్ కి ట్రేడ్ లోను, ఫాన్స్ లోను మంచి క్రేజ్, అంచనాలు ఉన్నాయి. బుక్ మై షో లో హాట్ కేక్ ల్లా రాధే శ్యామ్ టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. మరోపక్క ప్రభాస్ అండ్ రాధే శ్యామ్ టీం మీడియా మీట్స్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంకా గుడ్ న్యూస్ ఏమిటి అంటే.. ఏపీలో టికెట్ రేట్స్ పెరగడం. నిన్నటివరకు ఏపీలో టికెర్ రేట్స్ తక్కువగా ఉండడంతో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా అక్కడ ఏపీలో నష్టాలూ చవి చూడాల్సి వచ్చింది. అఖండ మూవీ తెలంగాణలో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తే.. ఆంధ్ర లో జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. పుష్ప పరిస్థితి అంతే. ఇక లేటెస్ట్ గా భీమ్లా నాయక్ కూడా అక్కడ ఏపీలో టికెట్ రేట్స్ వలన నష్టాలూ చూడాల్సి వస్తుంది.

Advertisement
CJ Advs

అయితే టాలీవుడ్ ప్రముఖులైన చిరంజీవి, ప్రభాస్, మహేష్ లాంటి వాళ్ళు జగన్ తో సమావేశమవ్వగా ఆయన ఇండస్ట్రీ సమస్యలపై సానూకూలంగా స్పందించారు. టికెట్ రేట్స్ పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐదో షో కి అనుమతి ఇచ్చారు. కానీ జీవో పై సంతకాలు చెయ్యలేదు. భీమ్లా నాయక్ రిలీజ్ అప్పుడే ఆ జీవో పాస్ అవుతుంది అనుకున్నా.. జగన్ గారు ఆచి తూచి ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ టైం కి ఆ జీవో పై సంతకాలు పెట్టారు. దానితో ఏపీలో టికెట్ రేట్స్ పెంచే వెసులుబాటు వచ్చింది. కానీ అది రేపటి నుందా.. ఎప్పటి నుండి అనేది ఇంకా స్పష్టత లేదు. ఏ సెంటర్ లో 200రూ, బి సెంటర్స్ లో 177 మరియు సి అండ్ డి  150 రూపాయల చొప్పున పాన్ ఇండియా మూవీస్ కి వర్తిస్తాయని, మాములు సినిమాలు ఏ సెంటర్ లో 150 రూ, బి సెంటర్స్ లో 135 మరియు సి అండ్ డి  89 రూపాయల చొప్పున టికెట్ రేట్స్ ఏపీలో పెరిగాయి. దానితో రాధే శ్యామ్ కి ఈ టికెట్ రేట్స్ పెరగడం హెల్ప్ అవుతోంది. 

Good news for Radhe Shyam:

<span>AP Ticket Rates: CM Jagan signs the GO</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs