భీమ్లా నాయక్ మూవీ విడుదలై పది రోజులు కావొస్తుంది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా, రానా డ్యానియల్ శేఖర్ గా అద్భుతమైన పెరఫార్మెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, సాగర్ దర్శకత్వం, థమన్ మ్యూజిక్ అన్ని.. భీమ్లా నాయక్ సినిమాని సక్సెస్ వైపు నడిపించాయి. అయితే సూపర్ హిట్ టాక్ తో మొదటి ఐదు రోజులు అదరగొట్టిన భీమ్లా నాయక్ .. తర్వాత నుండి ఢీలా పడిన విషయం తెలిసిందే. అయితే వీకెండ్ కి కాస్త పుంజుకుని పర్వాలేదనిపించుకుంది. ఓవరాల్ గా నిన్నటి తో భీమ్లా నాయక్ కంప్లీట్ రన్ పూర్తయినట్టే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
దానితో ఈరోజు వైరి వర్గాల పోరు మొదలైంది సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ అభిమానులేమో 100 కోట్ల షేర్ దాటేసింది అంటూ నెంబర్లని సర్క్యులేట్ చేస్తుంటే.. అసలు నెంబర్స్ ని పక్కనబెట్టి వాళ్ళు యాడ్ చేసుకున్నారు కాబట్టి మేము కట్ చేస్తాం అంటూ వైరి వర్గాలు ఇంకాస్త తగ్గించి ప్రచారం చేస్తున్నారు. నిజానికి వచ్చిన షేర్ ఈ రెండు అంకెల మధ్యలో ఉంది అనేది స్పష్టమైన సమాచారం. కానీ ఫాన్స్ ఆ అంకెలని స్ప్రెడ్ చేస్తుంటే.. వైరి వర్గం ఈ అంకెలని సర్క్యులేట్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటన వెలువడకపోతే ఇలానే ఉంటుంది.
అభిమానుల లెక్కలు
ఫైనల్లీ భీమ్లా నాయక్ క్రాస్డ్ 100 కోట్లు షేర్ (10 డేస్)
4 డేస్ వరల్డ్ వైడ్ షేర్ 77.63CR
5th డే షేర్ 9.56Cr
6th డే షేర్ 4.83 Cr
7th డే షేర్ 3.86 Cr
8th డే షేర్ 2.14 Cr
9th డే షేర్ 1.51 Cr
10th డే షేర్ 2.27 CR
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 101Cr ++
వైరి వర్గం లెక్కలు
నైజాం: 34.42 కోట్లు
సీడెడ్: 10.84 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.38 కోట్లు
ఈస్ట్: 5.34 కోట్లు
వెస్ట్: 4.88 కోట్లు
గుంటూరు: 5.10 కోట్లు
కృష్ణా: 3.67 కోట్లు
నెల్లూరు: 2.48 కోట్లు
ఏపీ, తెలంగాణ 10 డేస్ కలెక్షన్స్: 74.11 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 8.15 కోట్లు
ఓవర్సీస్: 12.40 కోట్లు
వరల్డ్ వైడ్ 10 డేస్ కలెక్షన్స్: 94.66 కోట్లు