ఎప్పుడో మహేష్ బాబు - పూరి జగన్నాధ్ కాంబోలో జన గణ మన అనే సినిమా అంటూ ప్రచారం జరగడం దానిని మహేష్ రిజెక్ట్ చెయ్యడం తో పూరికి కోపం వచ్చింది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం తర్వాత అదే జన గణ మన స్క్రిప్ట్ తో పూరి జగన్నాధ్ ఓ బాలీవుడ్ హీరోతో పాన్ ఇండియా గా ఆ మూవీ చేయబోతున్నాడని అన్నారు. ఇక రీసెంట్ గా లైగర్ తో ఫస్ట్ టైం పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్న విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ జన గణ మన మార్చ్ నెలాఖరున విదేశాల్లో మొదలు కాబోతుంది అని అన్నారు. పూరి జగన్నాధ్ కూడా విజయ్ తో చేసిన లైగర్ షూటింగ్ ప్యాకప్ జరిగిన రోజున జై జన గణ మన అనడంతో.. అందరూ విజయ్ తో పూరి జన గణ మన ప్రాజెక్ట్ ని ఫిక్స్ అయ్యింది అని అనుకున్నారు. ఇంతగా వార్తల్లో ఉంటున్న పూరి జన గణ మన పక్కనబెడితే.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జన గణ మన మాత్రం పూరి డ్రీం ప్రాజెక్ట్ కాదు.
మలయాళంలో పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన జన గణ మన గురించి. గత ఏడాది జన గణ మన టీజర్ తో అందరిలో ఇంట్రెస్ట్ రేకెత్తించిన పృద్వి రాజ్ జన గణ మన కి రిలీజ్ డేట్ లాక్ చేసి.. అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 28 న పృద్వి రాజ్ జన గణ మన రిలీజ్ కాబోతున్నట్లుగా ప్రకటించారు. మరి పూరి జగన్నాధ్ జన గణ మన ఇంకా మొదలే కాలేదు. కానీ పృద్వి రాజ్ జన గణ మన అప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. పూరి గనక జన గణ మన ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా మూవీగా చెయ్యాలి అనుకుంటే.. అప్పుడు టైటిల్ మార్చుకోవాల్సిందే . లేదంటే పృద్వి రాజ్ జన గణ మన మళయాళంలోనే కాదు ఆ హీరో సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించేస్తారు.