హీరోయిన్స్ అందరూ ఒకేలా ఉంటారేమో.. ఒకేసారి అటు హిందీలో ఇటు తెలుగులో, అటు తమిళ్ లో సినిమాలు చేస్తూ ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళకి డప్పు కొడుతుంటారు. ఇప్పుడు పూజ కూడా అదే రీతిలో తమిళ్ వాళ్ళకి బాజా వాయించడం మొదలు పెట్టింది. ఆఫ్ కోర్స్ ఆమె హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది మాత్రం తమిళ్ ముగ ముడి సినిమాతోనే. ఆ సినిమా అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాగే తర్వాత హిందీలో చేసిన మోహింజదారో కూడా ప్లాప్ అయ్యింది. ఆ టైం లో పూజ ని ఆదుకుని అవకాశాన్నిచ్చింది టాలీవుడ్ హీరో నాగ చైతన్య. ఆపై ఎంకరేజ్ చేసింది డీజే తో అల్లు అర్జున్.
అలాగే సపోర్ట్ చేసింది మహర్షి తో మహేష్. పూజ ని టాప్ రేంజ్ లో స్టార్ ని చేసింది అలా వైకుంఠపురములో. ఇక్కడ తెలుగునాట అన్ని అవకాశాలు ఇచ్చి ఆమెని స్టార్ హీరోయిన్ గా నిలబెడితే.. నాకు తమిళ ఇండస్ట్రీ ప్రత్యేకం అని బాజా కొట్టడం మొదలు పెట్టింది. తాను రాధే శ్యామ్ కి తమిళ్ లో డబ్బింగ్ చెప్పలేదు అని, ఫ్యూచర్ లో డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంది అని, పదేళ్ల తర్వాత మళ్ళీ బీస్ట్ తో తమిళ ఆడియన్స్ ముందుకి రాబోతున్నట్లుగా కూడా చెప్పింది. ఈ హీరోయిన్స్ అంతే.. ఎక్కడికి వెళితే అక్కడి వాళ్ళ పలుకులే పలుకుతారు. రేపు ఇదే తెలుగునాట మన మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు నన్ను స్టార్ ని చేసిందే తెలుగు ఇండస్ట్రీ అని ఇక్కడివాళ్ళకి చెబుతుందేమో.. కానీ వాస్తవాలు అందరికి తెలుసు కదా.. ఈ రోజు పూజ ఈ రేంజ్ లో ఉంది అంటే కారణం తెలుగు సినీ పరిశ్రమే అని.
ఈ హీరోయిన్స్ ఇలాంటివి ఎప్పుడు మనుకుంటారో.. సోషల్ మీడియా ఇంతగా డెవెలెప్ అయ్యాక ఎక్కడ ఏం మాట్లాడినా.. అందరి దృష్టికి వచ్చేస్తున్న తరుణంలో. ఇంకా ఈ మాట మార్చడాలు, సన్నాయి నొక్కులు నొక్కడాలు ఎప్పుడు మానేస్తారో..