Advertisement
Google Ads BL

RRR: చరణ్ ని డామినేట్ చేయనున్న ఎన్టీఆర్!


సాధారణంగా డైరెక్టర్ చేసే పని ఏంటి? సినిమాను డైరెక్ట్ చేసి ప్రొడ్యూసర్ చేతిలో పెట్టడం. ఎప్పుడయినా ఇప్పుడయినా చాలా మంది డైరెక్టర్స్ ఇదే పని చేసారు చేస్తున్నారు. కానీ ఇక్కడ రాజమౌళి అలా కాదు, తన సినిమా అంటే చిన్న చితక మొత్తం పని తానే  చూసుకుంటారు. ఒక్క చెక్ లు మీద సంతకం తప్ప సినిమా ఓపెనింగ్ నుండి సక్సెస్ సెలెబ్రేషన్స్ వరకు అన్ని తానై దగ్గరుండి అన్ని చూసుకుంటారు. 

Advertisement
CJ Advs

మరి ఇంత చేస్తున్న రాజమౌళి తన సినిమా స్టోరీ విషయంలో, తెరకెక్కించడంలో  కాంప్రమైజ్ అవుతారా? ఇద్దరు స్టార్ హీరోస్ ని పెట్టారు అంటే ఎంత అలోచించి ఉంటారు? ఇద్దరికీ స్క్రీన్ స్పేస్ ఎంత ఇచ్చి ఉంటారు? ఒక పాత్ర కి ఇంకో పాత్రకి ఏ మాత్రం తేడా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు? ఇలా మనలోనే ఇన్ని ప్రశ్నలు ఉంటే జక్కన్న ఎన్ని అలోచించి RRR అనే ఈ పాన్ ఇండియా మూవీ తీసి ఉంటారు. కానీ RRR విషయంలో జక్కన్న అలా చేయలేదు అంట. సినిమా లో రామ్ చరణ్ పాత్ర ను అక్కడక్కడా హైలైట్ చేసి, సినిమా మొత్తంలో అలానే క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పాత్ర ను బాగా హైలైట్ చేసారని గత కొన్ని రోజులు నుండి సోషల్ మీడియా లో ఓ టాక్. 

అలాగే క్లైమాక్స్ లో మాత్రం ఎన్టీఆర్ పాత్ర రామ్ చరణ్ పాత్రని ని బాగా డామినేట్ చేస్తుందని, అలానే ఆయన స్టోరీ రాసుకున్నారని తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే చరణ్ ఫ్యాన్స్ ఏ మాత్రం ఒప్పుకోరు. తమ హీరో ను కాదని వేరే హీరో ఇలా హైలైట్ చేసారు అని గొడవ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అలానే  సినిమా విషయంలో నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా అస్సలు ఆశర్యం లేదు. ఇది ఇలా ఉంటే, అసలు రాజమౌళి ఇలా ఎందుకు చేస్తారు, కచ్చితంగా ఇదంతా ఉట్టి మాటే అని మరో వాదన ఉంది. ఏది ఏమైనా మార్చ్ 25 న సినిమా నుండి బయటకు వచ్చేటప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరూ ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకుని రావాలని కోరుకుందాం.

RRR: NTR to dominate Charan!:

RRR: NTR Character to dominate Charan character!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs