Advertisement
Google Ads BL

ఇదేం నాటు ఫైటు నాయనోయ్.!


KGF చాప్టర్ 1 లోనే కేజీల కొద్దీ ఉన్న హీరో ఎలివేషన్ సీన్స్ కి భారతీయ సినీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోవడంతో ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది.. రెండో భాగంపై అంచనాలనూ భారీగా పెంచేసింది. ఇక KGF చాప్టర్ 2 టీజర్ యూట్యూబ్ ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో, ఎన్ని మిలియన్ల వ్యూస్ రాబట్టిందో మనం చూసాం. అలాగే మార్చ్ 27 న  రానున్న ట్రైలర్ పట్ల కూడా విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఈసారి హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సంజయ్ దత్, రవీనా టాండన్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ల వంటి స్టార్ యాక్టర్స్ కూడా యాడ్ అవడంతో ఏప్రిల్ 14 న విడుదల కానున్న KGF చాప్టర్ 2 కి ఓ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే అంతటి హైప్ తో పాన్ ఇండియా ఫిలింగా రానున్న ఈ  KGF 2 ని ఏమాత్రం కేర్ చెయ్యకుండా అదే రోజున తన తాజా చిత్రం బీస్ట్ ని దింపుతా అంటున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. 

Advertisement
CJ Advs

విజయ్ సరసన పూజ హెగ్డే నటిస్తోన్న బీస్ట్ చిత్రాన్ని పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలిచారట దర్శకుడు నెల్సన్. బీస్ట్ సినిమా రిపోర్ట్ తెలిశాకే సూపర్ స్టార్ రజనీకాంత్ పిలిచి మరీ నెల్సన్ కి మూవీ ఆఫర్ ఇచ్చారంటే ఈ కమర్షియల్ ఫిలింపై ఇన్ సైడ్ టాక్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు అనిరుధ్ మ్యూజిక్ తో ఇటీవలే వచ్చిన బీస్ట్ సాంగ్ హలమితి హబిబో 130 మిలియన్లకి పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. మరిక మాస్ హీరోగా తమిళనాట విజయ్ క్రేజ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. మామూలు సినిమాలతోనే వసూళ్ల వర్షం కురిపించే విజయ్ కి కాస్త విషయం ఉన్న సినిమా పడిందంటే కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నమోదైపోతాయి. 

కనుకనే ఇపుడీ రెండు చిత్రాల పోటీ అంతటా హాట్ టాపిక్ అయింది. నిజానికి మొదట్లో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూడా తన లాల్ సింగ్ చద్దా చిత్రం ఏప్రిల్ 14 వస్తుందని ప్రకటించినప్పటికీ KGF తో పోటీ పడే చొరవ చేయకుండా ప్రభాస్ ఆదిపురుష్ టీమ్ ని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు లాక్ చేసుకున్న ఆగష్టు 12 డేట్ అమీర్ తీసుకున్నారు. మరి అమీర్ ఖాన్ అంతటివాడే ఆగితే విజయ్ మాత్రం పోస్ట్ పోన్ చేసేదే లేదంటూ బీస్ట్ మోడ్ చూపించడం విశేషం. మొత్తానికి ఇదేం నాటు ఫైటు నాయనోయ్ అనుకుంటూ రెండూ భారీ కమర్షియల్ సినిమాలే కనుక ఫుల్ మాస్ మీల్స్ కి రెడీ అవుతున్నారు ఆడియన్స్.!

A Huge Fight at The Box Office on April 14th:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large tw-ta" dir="ltr"><span class="Y2IQFc" lang="en">KGF Chapter 2 and Beast films to be releasing on the same day</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs