Advertisement
Google Ads BL

రాధే శ్యామ్ హైదరాబాద్ మీట్ కి డేట్ ఫిక్స్


ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ కి టైం దగ్గరపడుతోంది. మరో ఆరు రోజుల్లో రాధే శ్యామ్ వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్.. రాధే శ్యామ్ కి విపరీతంగా ఉంది. అలాగే రాధే శ్యామ్ ప్రమోషన్స్ ని టీం.. ముంబై వేదికగా మొదలు పెట్టింది. ముంబై లో రాధే శ్యామ్ రెండో ట్రెయిలర్ లాంచ్ చేసారు. ఆ ఈవెంట్ లో ప్రభాస్, పూజ హెగ్డే సందడి చేసారు. అలాగే ప్రభాస్, పూజ హెగ్డే, దర్శకుడు రాధా కృష్ణ ముంబై మీడియా తో ఇంటరాక్ట్ అవుతూ రాధే శ్యామ్ పై అంచనాలు పెంచుతున్నారు. తమిళనాట చెన్నై వేదికగా గత రాత్రి రాధే శ్యామ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. 

Advertisement
CJ Advs

అక్కడ చెన్నై మీడియా తో రాధే శ్యామ్ విషయాలను పంచుకున్న ప్రభాస్ అండ్ పూజ హెగ్డే లు.. రేపు తెలుగు మీడియా తో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. ప్రభాస్ అండ్ టీం రేపు తెలుగులో రాధే శ్యామ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. గత డిసెంబర్ లో హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించాక మళ్ళీ తెలుగు మీడియా తో ఇంటరాక్ట్ కావడం ఇప్పుడే. రేపు రాధే శ్యామ్ ప్రెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. టాలీవుడ్ ప్రెస్ మీట్ లో ప్రభాస్ అండ్ టీం రాధే శ్యామ్ గురించి ఎలాంటి విషయాలు మీడియా తో పంచుకుంటారో అనే క్యూరియాసిటిలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. ఇక్కడ ప్రభాస్ ఇంటర్వ్యూలు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మార్చ్ 11 న సినిమా రిలీజ్ ఆడియన్స్ ముందుకు రాబోయే వరకు ఇలానే రాధే శ్యామ్ ప్రెస్ మీట్స్ తో టీం హడావిడి చేయబోతుంది. 

Prabhas to interact with Telugu media tomorrow :

Prabhas to do nonstop promotions for Radhe Shyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs