Advertisement
Google Ads BL

ఇదీ అసలు సిసలు అగ్ని పరీక్ష


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. బిగ్ స్క్రీన్ మీద కనిపించి రెండున్నరేళ్లుపైనే అయ్యింది. కరోనా టైం లో గ్యాప్ రావడంతో.. సూర్య ఓటిటికి వెళ్లి రెండు బిగ్గెస్ట్ హిట్స్ కొట్టారు. ఆకాశం నీ హద్దురా, జై భీం తో ఓటిటిలో మంచి హిట్స్ కొట్టడమే కాకుండా.. ఆ సినిమాలతో విమర్శకుల నుండి కూడా కాంప్లిమెంట్స్ అందుకున్నారు. అయితే బిగ్ స్క్రీన్ రిలీజ్ కి మాత్రం రెండున్నరేళ్ల గ్యాప్ వచ్చేసింది. ఆ రెండున్నరేళ్ల గ్యాప్ కి మరో ఐదు రోజుల్లో తెరపడబోతుంది. ఎవరికి తలవంచను(ET) అంటూ సూర్య బిగ్ స్క్రీన్ మీదకి రాబోతున్నారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాని పోటీకి పెట్టుకుని మరీ.

Advertisement
CJ Advs

నిజానికి ఇది సూర్యకి అసలు సిసలైన పరిక్ష అని చెప్పాలి. తెలుగులో కూడా ఎవరికి తలవంచను ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి దగ్గుబాటి రానాని, అలాగే టాప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బోయపాటి లని చీఫ్ గెస్ట్ లుగా ఆహ్వానించి బానే హడావిడి చేసారు.. అంతేకాకుండా ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూ మెగా ఫాన్స్ సపోర్ట్ కోసం ట్రై చేసారు. ఇక్కడ తెలుగులో సూర్య కి ఎలాంటి రిసెప్షన్ దొరుకుంది. మిగతా ఏరియాల్లో రాధే శ్యామ్ పోటీని ఎలా తట్టుకుని నిలబడతారు. సూర్య ET కిఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది వేచి చూడాల్సిందే. 

ET Releasing on March 10th:

Suriya ET vs Prabhas Radhe Shyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs