ఖిలాడీ ఓటిటి డేట్ కన్ ఫర్మ్

khiladi,ott premiers,ravi teja,ott,disney plus hot star | ఖిలాడీ ఓటిటి డేట్ కన్ ఫర్మ్

రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యన్నారాయణ నిర్మాతగా రవి తేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. సో సో టాక్ తో ఖిలాడీ థియేటర్స్ లో రన్ అయ్యింది. రవితేజ క్రాక్ సినిమా తో భారీ హిట్ కొట్టడంతో ఖిలాడీపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో రవితేజ విఫలమయ్యారు. అటు రాక్షసుడు హిట్ ఉన్న రమేష్ వర్మ కూడా ఖిలాడీ ని సరిగ్గా డీల్ చేయలేకపోయారు. దానితో సినిమా ప్లాప్ వైపు పయనించింది. హీరోయిన్ డింపుల్ హయ్యాతి. మీనాక్షి చౌదరి అందాలు ఆరబోసినా అవి సినిమాకి హెల్ప్ అవ్వలేదు. 

దానితో ఒక్కవారానికే ఖిలాడీ బాక్సాఫీసు దగ్గర చతికిల పడింది. అయితే ఇప్పుడు ఖిలాడీ మూవీ ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యింది. అది మార్చ్ 11 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి ఖిలాడీ ఓటిటి రిలీజ్ కి సిద్దమవుతుంది. మార్చ్ 11 న రాధే శ్యామ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే.. రవితేజ ఖిలాడీ ఓటిటి నుండి ఆడియన్స్ దగ్గరకి రాబోతుంది. 

Khiladi OTT premiers on:

<span>Khiladi bracing for OTT premiers</span>
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES