సమంత నాగ చైతన్యని ప్రేమించకముందు ఓ ప్రేమలో విఫలమైన సంగతి అందరికి తెలిసిందే. హీరో సిద్దార్థ్ తో సమంత కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారాలు నడిపింది. వారిద్దరూ కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో నటించిన జబర్దస్త్ సినిమా తో సిద్దు - సమంత లు ప్రేమికులుగా మారడమే కాదు.. గుడులు గోపురాలు తిరిగారు కూడా. అప్పట్లో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ కూడా నడిచింది. ఆ తర్వాత ఏమైందో సిద్దార్థ్ - సమంత విడిపోయారు. చైతు ప్రేమలో సమంత పడింది. అయితే అప్పటి విషయాన్ని సమంత ఈ రోజు దర్శకురాలు నందిని రెడ్డి బర్త్ డే కి విషెస్ చెబుతూ ఆ ట్వీట్ లో 2012 లో తనెంతగా సఫర్ అయ్యిందో చెప్పుకొచ్చింది.
హ్యాపీ బర్త్ డే నందిని రెడ్డి. నీవు నాకు చాలా ఆత్మీయురాలివి. నేను 2012 లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, ఎంతో కుంగుబాటుకి లోనయ్యాను. ఆ సమయంలో నువ్వు నీ బిజీ షెడ్యూల్ పక్కనపెట్టి నా కోసం రోజు మా ఇంటికి వచ్చి నా కోసం టైం ని స్పెండ్ చేస్తూ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా టెస్ట్ షూట్ చేయించావు. నా లైఫ్ లో ప్రతి అడుగు నువ్వు నాకెంత అండగా నిలబడ్డావో మాటల్లో చెప్పడం కష్టం. ఆ తర్వాతే నేను ధైర్యంగా సెట్స్ లోకి అడుగుపెట్టాను. ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే అంటూ సమంత అప్పటి సంగతిని ఇప్పుడు నందిని రెడ్డి బర్త్ డే సందర్భంగా బయటపెట్టింది.