Advertisement
Google Ads BL

గుడ్ న్యూస్ చెప్పిన డార్లింగ్ ప్రభాస్


ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. నిన్న బుధవారం ముంబై వెళ్లి అక్కడ రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్ లో పాల్గొన్న ప్రభాస్ ఫాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అది రాజమౌళి తో మరో సినిమా ఉంటుంది అని, రాజమౌళి తనతో సినిమా ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ.. ఆయనతో మాత్రం తప్పకుండా సినిమా చెయ్యడం ఖాయం, రాజమౌళి నాకు చాలా మంచి ఫ్రెండ్. రాజమౌళి గారిని నాతో సినిమా చెయ్యమని స్పెషల్ గా అడగాల్సిన పని లేదు. ఆయనకి నాకో ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ.. మా కంబోనేషన్ లో సినిమా ఉంటుంది అని చెప్పారు. దానితో ఫాన్స్ ఫుల్ ఖుషి ఫీలవుతున్నారు. 

Advertisement
CJ Advs

బాహుబలి తో రాజమౌళి ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టారు. సో వారి కాంబోలో మరో మూవీ అంటే ఆ అంచనాలు అంకెల్లో వర్ణించడం చాలా కష్టం. ప్రభాస్ లాంటి కటౌట్ కి రాజమౌళి లాంటి మాస్టర్ బ్రెయిన్ తోడైతే.. బాహుబలిని తలదన్నే సినిమాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నార్త్ ప్రేక్షకులు తనని యాక్షన్ హీరోగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని, కానీ ప్రేక్షకులకి బోర్ కొట్టకూడదనే రాధే శ్యామ్ లాంటి డిఫరెంట్ మూవీ ని ఎంచుకున్నట్టుగా ప్రభాస్ ముంబై ప్రెస్ మీట్ లో చెప్పారు.  ఇక ప్రభాస్ రాధేశ్యామ్, రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫిలిమ్స్ రెండు వారాల గ్యాప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. 

Prabhas tells happy news to fans:

Prabhas and SS Rajamouli To Collaborate For Yet Another film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs